Bangladesh Anti Hindu Violence : బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేని స్పష్టం చేసింది.
"బంగ్లాదేశ్‌లో తీవ్రవాద భావజాలంతో రెచ్చగొట్టే చర్యలు, హింసాత్మక ఘటనలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా హిందువులతోపాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు, బెదిరింపు ఘటనలపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే మా ఆందోళన తెలియజేశాం. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది" అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇస్కాన్‌ను నిషేధించాలని చేస్తున్న వాదనలపై స్పందిస్తూ, సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు.
#WATCH | Delhi: On the arrest and imprisonment of Chinmoy Krishna Das in Bangladesh, MEA Spokesperson Randhir Jaiswal says, " we see iskcon as a globally well-regarded organisation with a strong record of social service. as far as the arrest of chinmoy das is concerned, we have… pic.twitter.com/gJHKEN3RW3
— ANI (@ANI) November 29, 2024
అదానీపై ఆరోపణలు
అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై కూడా భారత విదేశాంగశాఖ స్పందించింది. అది కొన్ని ప్రైవేటు సంస్థలు, కొంత మంది వ్యక్తులతోపాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారమని పేర్కొంది. వీటికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎటువంటి సమాచారం రాలేదని స్పష్టం చేసింది.
"అదానీ వచ్చిన లంచం ఆరోపణలు గురించి చెప్పాలంటే, అది ప్రైవేటు వ్యక్తులు, అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. అవి వాటిని అనుసరిస్తాయని విశ్వసిస్తున్నాం" అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. అదానీ కేసులో భారత్‌కు అమెరికా సమన్లు లేదా వారెంటు ఇచ్చిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, భారత్‌కు అటువంటి విజ్ఞప్తి ఏదీ రాలేదన్నారు.
#WATCH | Delhi: On the Adani indictment issue, MEA Spokesperson Randhir Jaiswal says, " this is a legal matter involving private firms and individuals and the us department of justice. there are established procedures and legal avenues in such cases which we believe would be… pic.twitter.com/w8CCLqU660
— ANI (@ANI) November 29, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశం జరుగుతున్న వేళ, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పినట్లుగానే పాకిస్థాన్‌కు జట్టు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన కారణాలతో టీమ్‌ఇండియాను పంపించడం లేదని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Delhi: On Indian cricket team participating in Pakistan, MEA Spokesperson Randhir Jaiswal says, " ... the bcci has issued a statement... they have said that there are security concerns there and therefore it is unlikely that the team will be going there..." pic.twitter.com/qRJPYPejZd
— ANI (@ANI) November 29, 2024