ETV Bharat / international

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 73మంది మృతి- లీకైన ఇంటెలిజెన్స్ పేపర్స్​లో ఏముంది?

గాజాపై జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 73 మంది పాలస్తీనియన్లు మృతి- ఇరాన్​పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ సైనిక సన్నాహాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Israel Attack On Gaza
Israel Attack On Gaza (Associated Press)

Israel Attack On Gaza : ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇళ్లే లక్ష్యంగా డ్రోన్‌ దాడి జరిగిన నేపథ్యంలో గాజా పౌరులపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా విరుచుకుపడింది. ఉత్తర గాజాపై జరిపిన ఐడీఎఫ్‌ వైమానిక దాడుల్లో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరోవైపు ఇరాన్​ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైనిక సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఉత్తర గాజాలో బీట్​ లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానికి దాడులకు దిగినట్లు హమాస్ వార్త సంస్థ వెల్లడిచింది. మరణించిన 73 మందిలో అనేక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడగా కొందరు శిథిలాల కిందే చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజాలోకి ఔషధాలు, ఆహారంతో నిండిన మానవతాట్రక్కులు చేరకుండా ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు చేయడమే కాకుండా ఆస్పత్రులను కూడా ముట్టడిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తర గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ విమానాలు గర్జించాయి. లెబనాన్‌ నుంచి 180 క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చిన వేళ బీరుట్‌లోని దహియేహ్‌ ప్రాంతంపై ఐడీఎఫ్‌ బాంబులు కురిపించింది. ఈ ఘటనల్లో పలువురు మృతిచెందినట్లు సమాచారం.

లీకైన యూఎస్​ ఇంటెలిజెన్స్ పత్రాలు
మరోవైపు, ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్‌ సిద్ధమైనట్లు అమెరికా నిఘా సంస్థ NGAకు చెందిన రెండు కీలక పత్రాలు లీకయ్యాయి. ఇజ్రాయెల్‌లో అమెరికన్‌ గూఢచర్య ఉపగ్రహాలు సేకరించిన ఐడీఎఫ్‌ బలగాల షాటిలైట్‌ చిత్రాలకు సంబంధించిన చిత్రాలు అందులో ఉన్నాయి. వారు ఇరాన్‌పై దాడులకు సన్నద్ధమవుతున్నట్లు ఆ చిత్రాలను ఆధారంగా తెలిసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది.

ఒక పత్రంలో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడం, గాలింపు, రెస్క్యూ ఆపరేషన్‌లు సహా క్షిపణి వ్యవస్థల రీపొసిషనింగ్‌ విన్యాసాలను ఐడీఎఫ్‌ బలగాలు చేపట్టినట్లు న్యూయార్క్ టైమ్​ కథనంలో వెల్లడైంది. మరో పత్రంలో ఇరాన్‌లోని లక్ష్యిత స్థావరాలకు సైనిక సామాగ్రి తరలింపు గురించిన సమాచారం ఉన్నట్లు తెలిపింది. నిఘా సమాచారం ఎలా లీకయిందన్న అంశంపై పెంటగాన్‌, అమెరికా నిఘా వ్యవస్థలతో పాటు ఎఫ్​బీఐ విచారణ జరుపుతోంది. అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల సమాచారం తనకు తెలుసని తెలిపారు. పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.