ETV Bharat / international

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజున ఉగ్రదాడికి ప్లాన్- FBI స్పెషల్​ ఆపరేషన్​తో గుట్టురట్టు - US ELECTIONS 2024

ఐఎస్ఐఎస్ ప్రేరణతో అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఆత్మహుతి దాడికి ప్లాన్ - అఫ్గాన్​ పౌరుడిని అరెస్ట్ చేసిన ఎఫ్​బీఐ

Terror Attack On US Election Day
Terror Attack On US Election Day (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 10:47 AM IST

Terror Attack On US Election Day : అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్ర దాడికి కుట్ర పన్నిన అఫ్గానిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని ఎఫ్​బీఐ అరెస్టు చేసినట్లు యూఎస్ న్యాయ శాఖ వెల్లడించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ నుంచి ప్రేరణ పొంది, అమెరికాలో పెద్దసంఖ్యలో గుమిగూడే వ్యక్తులే లక్ష్యంగా దాడికి నిందితుడు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- 2021 సెప్టెంబరులో నాసిర్‌ అహ్మద్‌ తౌహేదీ(27) ప్రత్యేక వలస వీసాపై అమెరికాలో ప్రవేశించాడు. ప్రస్తుతం ఓక్లహోమా సిటీలో నివసిస్తున్నాడు. అమెరికాలో ఎన్నికల రోజున ఐఎస్‌ఐఎస్‌ పేరుతో ఉగ్రదాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఆ దాడి సమయంలో తౌహేదీ, అతడి సహచరులు ఆత్మాహుతిదళంగా మారిపోవాలనుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అలాగే ఉగ్రదాడి కోసం ఏకే-47 రైఫిల్స్ ఆర్డర్ చేశాడు. భార్యాబిడ్డలకు ఇంటికి(స్వదేశానికి) వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎఫ్​బీఐ- నిందితుడు తౌహేదీ, అతడి సహచరుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి సహచరుడు మైనర్ కావడం వల్ల అతడి పేరు వెల్లడించలేదు.

విచారణలో విస్తుపోయే నిజాలు
తౌహేదీ ఐఎస్ఐఎస్​కు మద్దతుగా పనిచేస్తున్నాడని, ఆ ఉగ్రసంస్థకు అండగా ఉన్న స్వచ్ఛంద సంస్థకు సహకరించాడని ఎఫ్​బీఐ విచారణలో తేలింది. అలాగే ఉగ్రవాదంపై ఆసక్తి ఉన్న వ్యక్తుల నియామకాలు, వారికి బోధనలు చేస్తున్నట్లు వెల్లడైంది. నిందితుడు ఈ ఏడాది జులైలో వైట్‌ హౌస్‌, వాషింగ్టన్‌ వెబ్‌ కెమెరాలను సందర్శించినట్లు తేలింది. దీంతో తాహౌదీపై అధికారులు కన్నేశారు.

ఆపరేషన్ సక్సెస్
ఈ క్రమంలో తౌహేదీ, అతడి సహచరుడు తమ వ్యక్తిగత ఆస్తిని అమ్మకానికి పెడుతున్నట్లు ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. అప్పుడే ఎఫ్​బీఐ గత నెలలో ఒక ఇన్​ఫార్మర్​ను నియమించింది. ఆ ఇన్​ఫార్మర్ వారితో చనువుగా మెలిగి గన్ సప్లై చేసే వ్యాపారిగా నటించారు. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్ కావడం వల్ల తౌహేదీని అరెస్ట్ చేశారు. ఈ అభియోగంపై నిందితుడికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

'ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం'
ఈ విషయంపై ఎఫ్​బీఐ డైరెక్టర్ క్రిష్టోఫర్ రే స్పందించారు. అమెరికాలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ఎఫ్​బీఐ తొలి ప్రాధాన్యం అని పేర్కొన్నారు. అమెరికా ప్రజలను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని వెల్లడించారు.
నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.