Change 6 brings samples From Moon : చైనా ప్రయోగించిన చాంగే-6(Chang'e-6) ప్రోబ్, జాబిల్లి పైనుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. తొలిసారి చంద్రుని అవతలి వైపు నుంచి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ప్రోబ్ ల్యాండ్ అయింది. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ల్యాండింగ్ ప్రాంతంలో వాతావరణశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
చాంగే-6 ప్రోబ్ తీసుకొచ్చిన నమూనాలు 20లక్షల 50 వేల ఏళ్ల క్రితానికి చెందిన అగ్నిపర్వతశిలలకు సంబంధించినవని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుని ఆవలివైపున అగ్నిపర్వత శిలలు, క్రేటర్‌లు ఉంటాయని ఇప్పటికే స్పష్టమైంది. చంద్రుని పుట్టుక, ఉల్కాపాతం వంటి ఎన్నో పరిశోధనలకు ఈ నమూనాలు కీలకం కానున్నాయి. జాబిల్లి ఉపరితలాల మధ్య భౌగోళిక వ్యత్యాసాల గురించిన ప్రశ్నలకు జవాబు చెప్పనున్నాయి. గతంలో అమెరికా, సోవియట్ మిషన్లు చంద్రుని దగ్గరి వైపు నుంచి నమూనాలను సేకరించాయి. అయితే చైనా తొలిసారి జాబిల్లిపై దూర ప్రాంతాల నుంచి మట్టిని సేకరించింది.
మే 3న చాంగే-6ను చైనా ప్రయోగించింది. 53 రోజులు ప్రయాణించి అది చంద్రుని చేరింది. కోర్‌లో ప్రాంతంలో డ్రిల్ చేసి ఉపరితలం నుంచి రాళ్లను సేకరించింది. గతంలోనూ చైనా చాంగే-5 ప్రోబ్‌ను పంపి చంద్రుని సమీప వైపు నుంచి చైనా నమూనాలను సేకరించింది.
సంక్లిష్ట ప్రక్రియ!
చందమామకు సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి, భూమికి తీసుకొచ్చింది. కానీ అవతలి భాగం నుంచి ఈ నమూనాలను తీసుకురావడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఆ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. ఈ చాంగే-6 యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. కానీ అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. అవతలి భాగం పైపొర ఒకింత మందంగా ఉందని పరిశీలనల్లో తేలింది. దీనికి కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి.
జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే- అమెరికాతో కుదిరిన ఒప్పందం
బైడెన్, ట్రంప్ మధ్య 90 నిమిషాల డిబేట్- ఎప్పుడంటే? - Biden Trump Debate