Yoga Asanas To Lose Face Fat : ఎలాంటి కాస్మొటిక్ ప్రోడక్ట్స్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? సహజ సౌందర్యానికే మీరు మొగ్గు చూపుతారా? అయితే మీరు కొన్ని వ్యాయామాల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. నిర్దిష్ట భంగిమలతో కూడిన ఆసనాలు, ముఖ కండరాలకు కాస్త ఒత్తిడి కలిగించే ప్రాణాయామ పద్ధతులు సహా కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా మీరు సహజ సౌందర్యాన్ని పొందవచ్చు.
ఈ ఆసనాలతో ముఖం, మెడకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ముఖంపై ఉండే కొవ్వులు కరిగిపోతాయి. శరీరం కూడా శక్తిమంతంగా మారడం సహా చిక్కినట్లుగా మంచి షేపులోకి మారుతుంది. మరో విషయం ఏంటంటే చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా కనిపించేందుకు యోగాను ఎంచుకుంటే, మీకు మంచి ఫలితం కనిపించడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రతి రోజూ అలవాటుగా మార్చుకుని కొన్ని ఆసనాలు వేయడం వల్ల మీకు ఎలాంటి సౌందర్య సాధనాల అవసరం ఉండదు. అవేంటో తెలుసుకుందాం
సిద్ధ నడక(Siddha Walk)
శారీరక, మానసిక ప్రయోజనాలు కలిగించే ముఖ్యమైన ఆసనాల్లో సిద్ధ నడక ఒకటి. దీన్నే ఇన్ఫినిటీ వాక్ అని కూడా పిలుస్తారు. సాధారణ వాకింగ్ కంటే ఇది చాలా శక్తిమంతమైనదనీ, మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతుంటారు. నేల మీద 8 అంకెను ఊహించుకుని లేదా గీసుకుని 8 ఆకారంలో నడవాలి. ఇది సిద్ధ నడక. ఇలా 20నుంచి 30 నిమిషాల పాటు నటిచారంటే మీరు శారీరక, మానసికంగా ఫిట్ అవడం సహా అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం ఖాయం.
పాదహస్తాసనం(Padahasthasana)
రెండు చేతులను కలిపి పాదాలను అందుకోవడమే పాదహస్తాసనం. తలను మోకాలికి ఆనించాలి. ఈ భంగిమ చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చకుని వదులుతుండాలి. ఇది మీ ముఖం, మెడతో పాటు పూర్తి శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ధనురాసనం(Dhanurasana)
శరీరాన్ని ధనసు ఆకారంలోకి అంటే విల్లులా వంచి చేసే ఆసనమే ధనురాసనం. నేలపై బోర్లా పడుకుని వెనకకు వంచి పాదాలను చేతులతో పట్టుకోవాలి. ఇలా 15 నుంచి 20సెకండ్ల పాటు ఉన్నాక రిలాక్స్ అవాలి.
చక్రాసనం(Chakrasana)
ఈ ఆసనంలో శరీరం చక్రం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని చక్రాసనం అంటారు. దీనికోసం ముందుగా వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్లు మడిచి చేతులను భుజాల కిందుగా ఆనించాలి. శ్వాస పీల్చుకుని వదులుతూ నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడను కిందకు వేలాడేలా ఉంచాలి. ఇలా 15 నుంచి 20 సెకండ్ల పాటు చేయాలి.
హలాసనం(Halasana)
వెల్లకిలా పడుకుని చేతులను నిటారుగా పక్కకు ఉంచాలి. మీ కాళ్లను 90డిగ్రీల ఆకారంలో ఎత్తి తలపైన ప్రాంతంలో నేలపై ఆనించాలి. ఇది చూడటాపికి నాగలి(హలం)లా అనిపిస్తుంది. అందుకే దీన్ని హలాసనం అంటారు. ఈ ఆసనం ద్వారా వెన్నుముకపై కాస్త ఒత్తిడి కలిగినప్పటికీ ముఖ కండరాల కదలికలు పెరిగి కొవ్వు కరుగుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బ్లాక్ హెడ్స్ ఎందుకొస్తాయి? ఎలా క్లియర్ చేసుకోవాలి? - Blackheads Removal Tips
ఈజీగా ఇంటిని శుభ్రం చేసుకోవాలా? ఈ 9 టిప్స్ పాటిస్తే ఫుల్ నీట్ అండ్ క్లీన్! - Easy Home Clean Tips