ETV Bharat / health

నిద్రలేమితో క్యాన్సర్ - డయాబెటిస్, హార్ట్ ఎటాక్ బోనస్! ఇంకా - నిద్రలేమి సమస్యలు

Side Effects of Lack of Sleep : నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేస్తూ.. జాగారం చేస్తున్నారా అయితే.. మీ ఆరోగ్యం పెను ప్రమాదంలో పడిపోయినట్టే అంటున్నారు నిపుణులు.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Side Effects of Lack of Sleep
Side Effects of Lack of Sleep
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 1:43 PM IST

Side Effects of Lack of Sleep: నిద్రలేమి.. ప్రస్తుతం అందరిలో ఇదే సమస్య. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని బాధితులే. నిద్రలేమికి కారణాలు అంటే అబ్బో చాలానే ఉన్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఉద్యోగ బాధ్యతలు, బతుకు బాధలు, భవిష్యత్ భయాలు.. ఇవన్నీ కూడా మనకు నిద్రను దూరం చేసే విలన్లే. వీటిని దాటుకొని బెడ్ మీదకు చేరిన తర్వాతైనా పడుకుంటారా అంటే.. ముఖానికి ఫోన్ కట్టుకొని అర్ధరాత్రి వరకూ దాంతో సహవాసం చేస్తుంటారు. అయితే.. ఈ పరిస్థితి ఒకటీ రెండు రోజులైతే పర్వాలేదు. అంతకు మించి కొనసాగితే మాత్రం ఇబ్బందులు ఖాయమని అంటున్నారు నిపుణులు!

మరణం: కంటి నిండా నిద్ర పోకపోతే ప్రాణాలకే ప్రమాదమని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్మోకింగ్​, డ్రింకింగ్​ ఆరోగ్యానికి ఎంత హానికరమో.. నిద్రలేమి కూడా అంతకు మించి అంటున్నారు నిపుణులు. కంటినిండా నిద్ర పోకపోతే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగి ఒక్కోసారి మరణం సంభవిస్తుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కువ కాలం బతకాలంటే.. ఎక్కువ సేపు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

క్యాన్సర్: రాత్రి వేళ సరైన సమయానికి నిద్ర పోకుండా టీవీ చూస్తుంటే.. మీ శరీరం తక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

వయసును బట్టి నిద్ర - మీరు ఎన్ని గంటలు పడుకోవాలో తెలుసా?

గుండె జబ్బులు: నిద్రలేమికి, గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్రలేమి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 42% ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ అధ్యయనం 10 సంవత్సరాల పాటు 24వేల మందికి పైగా ప్రజలను పరీక్షించింది.

డయాబెటిస్​: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు.. భవిష్యత్తులో మధుమేహానికి గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. సరైన నిద్రలేకపోతే శరీరం.. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ సామర్థ్యం కోల్పోతుందని.. అంతేగాక రోగ నిరోధక సమస్యలు ఏర్పడి వివిధ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నాయి.

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

జ్ఞాపకశక్తిపై ప్రభావం: నిద్రలేమి.. మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే.. శరీరంలోని అన్ని క్రియలు సక్రమంగా జరిగేలా మానిటర్ చేసేది మెదడే. అందుకే, రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం మీ స్వల్ప, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

అలర్ట్ : సరిగా నిద్ర పోవట్లేదా - మీ అందం ఇలా కరిగిపోతుంది!

అధిక బరువు: నిద్రలేమి సమస్యతో బరువు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం.. నిద్రలేమి వల్ల ఆకలి పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే కడుపు నిండిందనే భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ చాలా తక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా ఆకలి పెరిగి ఎక్కువ ఆహారాన్ని తినేస్తారట. అతిగా ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. బిట్రన్‌‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా బరువు పెరగడం వల్ల గురక వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపింది.

అంతేకాకుండా నిద్రలేమి వల్ల అలసట, అకాల వృద్ధాప్యం, రాంగ్​ డెసిషన్స్​, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం, ఒంటరితనం, అల్జీమర్స్ వ్యాధి, ఆందోళన, అధిక రక్తపోటు, ఒత్తిడి, కారు ప్రమాదాలు, తలనొప్పి, చిరాకు, జీర్ణాశయ సమస్యలు వంటివి తలెత్తుతాయి.. కాబట్టి రోజుల్లో ఎన్ని పనులున్నా.. సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకోండి..

నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తోందా? - అయితే కారణాలు ఇవే!

నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్​ స్లీప్!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.