ETV Bharat / health

కిడ్నీ వ్యాధి ముప్పు భయపెడుతోందా? - ఈ 5 పండ్లు తినమని సలహా ఇస్తున్న నిపుణులు! - Fruits for Kidney Health

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 2:09 PM IST

Foods to Eat Kidney Disease : మీరు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే, ఆస్పత్రికి వెళ్లకుండానే కిడ్నీలను ఆరోగ్యం ఉంచుకునేందుకు ఈ ఐదు రకాల పండ్లు మనం రోజు తినే ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు వైద్యులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐదు రకాల పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

Foods to Eat Kidney Disease
Foods to Eat Kidney Disease (ETV Bharat)

Foods to Eat Kidney Disease : మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలను, శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడూ తొలగించి.. శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు సాయంచేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో అనేక కారణాల వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఈ 5 రకాల పండ్లు రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

బెర్రీలు, యాపిల్స్, సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయల లాంటి తాజా పండ్లను తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 2020లో The National Institute of Diabetes and Digestive and Kidney Diseases (NIDDK)లో ప్రచురితమైన Eating Right for Kidney Health (రిపోర్ట్) అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇందులో Dr. Andrew S. Narva పాల్గొన్నారు.

క్రాన్ బెరీస్:
బెర్రీ జాతికి చెందిన క్రాన్ బెరీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోయాంతో సైనడిన్స్.. క్రాన్ బెరీస్​లో పుష్కలంగా ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇవి మూత్రపిండాల ఇన్​ఫెక్షన్ నివారణలో సహాయపడతాయని వెల్లడించారు. మొత్తం మూత్రపిండాల ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయని వివరించారు.

నిమ్మకాయలు:
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయల్లో విటమిన్ C అధికంగా ఉంటుందని.. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా మూత్ర నాళాల ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తాయని వివరించారు.

పుచ్చకాయ:
అధిక నీటి శాతంతో ఉండే పుచ్చకాయలో టాక్సిన్స్​ను బయటికి పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి ట్యాక్సిన్​లను బయటకు పంపడమే కాకుండా మూత్ర పిండాలను హైడ్రేట్​గా ఉంచుతాయని అంటున్నారు.

యాపిల్స్:
యాపిల్స్​లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు వివరించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫ్లమేషన్​ను తగ్గించడం, నిర్వీశీకరణను ప్రోత్సహించి మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయని తెలిపారు.

దానిమ్మ:
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే మరో పండు దానిమ్మ. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామెటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు వాటి పనితీరును మెరుగు పర్చేందుకు తోడ్పడతాయని వెల్లడించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మూత్ర విసర్జన టైమ్​లో ఇలా అవుతోందా? - ప్రొస్టేట్ సమస్య కావొచ్చు - వెంటనే అలర్ట్ కాకపోతే అంతే! - Effects of Prostate Enlargement

కూర్చుని లేస్తున్నప్పుడు తుంటి, నడుము నొప్పిగా ఉంటోందా? - అది సయాటికా కావొచ్చు - ఇలా చేశారంటే నొప్పి మాయం! - Home Remedies for Sciatica

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.