ETV Bharat / health

వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం! ఫుల్​ లిస్ట్​ ఇదే! - Vegetables To Avoid During Monsoon

Vegetables To Avoid During Monsoon : వర్షాకాలం వచ్చేసింది. వేడికి గుడ్ బై చెప్పి, హాయిగా వెచ్చగా దుప్పటి కప్పుకుని ఉండచ్చు అనుకుంటున్నారా? నిజమే కానీ వర్షాకాలంలో కూడా కొన్ని చేయకూడని పనులు, తినకూడని ఆహారాలు ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ కాలంలో తినకూడని కొన్ని కూరగాయలుంటాయట. అవేంటో చూసేద్దామా?

Vegetables To Avoid During Monsoon
Vegetables To Avoid During Monsoon (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 7:18 PM IST

Vegetables To Avoid During Monsoon : హమ్మయ్య వర్షాకాలం వచ్చేసింది, వేడి, ఉక్కపోత సమస్య పోయినట్టే అని అంతా రిలాక్స్​గా ఫీలవుతున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండీ. వేసవిలో ఎలా అయితే ఉక్కపోత, వేడి, వడ దెబ్బ లాంటి సమస్యలున్నాయో, వర్షకాలంలో కూడా అలాగే రకరకాల వ్యాధుల ముప్పు ఉంది. ముఖ్యంగా ఈ సీజన్​లో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాకరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ఆహార పరిశుభ్రత లోపించి అనారోగ్యం పెరుగుతుంది. అందుకే వర్షకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ కాలంలో కొన్ని వెజిటేబుల్స్​లో తేమ కీటకాలు, బ్యాక్టీరియాలు ఎక్కువయి జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. వర్షాకాలంలో దూరంగా ఉండాల్సిన ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజీ, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలకు తీసుకోకుండా ఉండటం మంచిది. వర్షాకాలంలో ఈ కూరగాయల్లో తేమ అధికంగా ఉండి వాటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. వీటిని తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు ఏర్పడి, జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

వర్షకాలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, బ్రెసెల్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలకు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. వీటిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నప్పటికీ అధిక తేమ కారణంగా ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తగినంత శుభ్రత లేకుండా వీటిని తినడం వల్ల కాలుష్య ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, టర్నిప్ వంటి రూట్ వెజిటేబుల్స్​ను కూడా వర్షాకాలంలో తినడం మానేయాలి. తప్పదు తినాలి అనుకుంటే వీటిని శుభ్రంగా కడుక్కుని ఉడికించుకుని తినడం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో నేలలో అధిక తేమ కారణంగా ఈ కూరగాయలు ఎక్కువ నీటిని పీచ్చుకుంటాయి. ఫలితంగా అవి త్వరగా కుళ్లిపోవడం లేదా పాడైపోవడం వంటివి జరుగుతాయి. అలా అని వీటిని ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచడం కూడా మంచిది కాదు.

పోషకాల గనిగా చెప్పుకునే పుట్టగొడుగులు కూడా వర్షాకాలంలో తినదగిన కూరగాయలు కాదట. ఈ కాలంలో వీటిని తినడం వల్ల బ్యాక్టీరియా పెనిగి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందట. ఫలితంగా జీర్ణ రుగ్మతలు, అరుగుదల సమస్యలు వచ్చే ప్రమాదముందట. బలహీనమైన రోగనిరోధ వ్యవస్థ ఉన్న వారిలో సమస్య మరింత తీవ్రతరం అవుతుందట.

పిల్లలు, పెద్దలూ అంతా చాలా ఇష్టంగా తినేది, కూరగాయల రాజుగా చెప్పుకునేది అదేనండీ వంకాయ. దీన్ని కూడా వర్షకాలంలో తినకుండా ఉండటమే మేలట. దీంట్లో కూడా ఈ సీజన్ అంతా తేమ శాతం ఎక్కువగా ఉండి బ్యాక్టీరియాకు, పురుగులకు నిలయంగా మారుతుందట. కాబట్టి వీలైనంత వరకు వర్షకాలం పూర్తయ్యే వరకు ఈ కూరగాయలు, ఆకుకూరలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కనుక ఆచితూచి ఆహారం తీసుకోండి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సైట్​ పెరుగుతుందా? ఈ కూరగాయలతో కంటి చూపును కాపాడుకోండిలా! - Eyesight Imporving Vegetables

నెల రోజులు ఉల్లిపాయలు తినకపోతే ఏం జరుగుతుంది? మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? - What Happen If I Stop Eating Onions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.