ETV Bharat / health

చిన్న వయసులోనే తెల్ల గడ్డం ఇబ్బందిపెడుతోందా? - ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం! - Tips to Make Beard Hair Black - TIPS TO MAKE BEARD HAIR BLACK

Tips to Make Beard Hair Black : సాధారణంగా వయసు పెరిగేకొద్దీ తెల్లవెంట్రుకలు రావడం కామన్. ఇక మగవారికైతే గడ్డం కూడా నెరిసి తెల్లగా కనిపిస్తుంది. కానీ, ఈరోజుల్లో చాలా మందిని చిన్న వయసులోనే ఇలాంటి సమస్య ఇబ్బంది పడుతోంది. మరి మిమ్మల్ని కూడా తెల్ల గడ్డం బాధిస్తోందా? డోంట్​వర్రీ.. ఈ సింపుల్​ టిప్స్​తో మీ గడ్డాన్ని నల్లగా మార్చుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎలాగంటే?

Tips to Make Beard Hair Black
Beard
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 2:35 PM IST

Natural Home Remedies to Make Beard Black : నేటి రోజుల్లో చాలా మంది పురుషులు ముఖ్యంగా యువత చిన్న వయసులోనే తెల్ల గడ్డం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు వైట్ బియర్డ్​ నల్లగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అయితే, వీటిలోని రసాయనాలు చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, అలాకాకుండా ఇప్పుడు చెప్పబోయే కొన్ని హోమ్ రెమిడీస్​తో నేచురల్​గా మీ తెల్ల గడ్డాన్ని(Beard) నల్లగా మార్చుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ హోమ్ రెమిడీస్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బ్లాక్ వాల్‌నట్స్ : మీ నెరిసిన గడ్డాన్ని నల్లగా మార్చడంలో బ్లాక్ వాల్​నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం.. ముందుగా 7 నుంచి 8 బ్లాక్ వాల్‌నట్‌లను తీసుకొని పొడిలా చేసుకోవాలి. ఆపై దానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కనీసం అరగంట పాటు మరిగించుకోవాలి. అనంతరం దానిని చల్లార్చుకొని మీ గడ్డానికి అప్లై చేసుకోవాలి. అలా సుమారు 20 నిమిషాల పాటు ఉంచి ఆపై క్లీన్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బియర్డ్​కు ఆ పేస్ట్ అప్లై చేసేటప్పుడు చేతులకు అంటుకోకుండా హ్యాండ్ బ్లౌజ్ ధరించడం మంచిది.

బ్లాక్ టీ : తెల్ల గడ్డంతో ఇబ్బందిపడేవారికి బ్లాక్ టీ బెస్ట్​ ఆప్షన్​ అని.. మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. ఒక కప్పు వేడి నీటిలో బ్లాక్ టీ బ్యాగ్‌లను వేయండి. ఆపై అది చల్లారాక ఆ మిశ్రమాన్ని మీ గడ్డానికి అప్లై చేయండి. అలా 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచండి. ఫలితంగా బ్లాక్ టీలో ఉండే టానిన్లు మీ గడ్డాన్ని నల్లగా మార్చడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.

ఆమ్లా ఆయిల్ : మీరు గుబురుగా ఉండే నల్లని గడ్డాన్ని కోరుకుంటే ఆమ్లా ఆయిల్​ను ఇలా ట్రై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు బియర్డ్​ను బ్లాక్​గా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు. ఇందుకోసం ఉసిరి నూనెను మీ గడ్డానికి అప్లై చేసి ఆపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మార్నింగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

2016లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 6 నెలల పాటు రోజుకు రెండుసార్లు గడ్డంపై ఉసిరి ఆయిల్​ను మసాజ్ చేసిన పురుషులలో గడ్డం పెరుగుదల కనిపించడంతో పాటు నెరిసిన గడ్డం కాస్త నల్లగా మారిందని తేలింది. ఈ పరిశోధనలో ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ షాహిన్ షేఖ్ పాల్గొన్నారు. ఉసిరి ఆయిల్​ను గడ్డానికి మసాజ్​ చేయడం ద్వారా అందులోని పోషకాలు బియర్డ్​ పెరుగుదలకు, రంగును మార్చడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

జుట్టు భారీగా ఊడిపోతోందా? - ఇంట్లో దొరికే హెయిర్ మాస్క్​లతో రిజల్ట్ పక్కా!

కొబ్బరి నూనె, కరివేపాకు : తెల్ల గడ్డాన్ని సహజంగా నల్లగా మార్చడంలో ఈ హోమ్ రెమిడీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక పాత్రలో కొబ్బరినూనె, కరివేపాకు తీసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆపై దాన్ని చల్లార్చుకొని వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మీ గడ్డానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. అలా కనీసం 30 నిమిషాలు ఉంచి ఆపై కడుక్కోవాలి.

ఉల్లి రసం : ఇది కూడా సహజంగా వైట్ బియర్డ్​ను బ్లాక్​గా మార్చడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా ఉల్లి రసాన్ని ప్రిపేర్ చేసుకొని ఆపై దాన్ని కాటన్ బాల్​తో మీ గడ్డానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని వాటర్​తో కడిగేసుకోవాలి. ఉల్లిరసంలో సల్ఫర్, ఇతర పోషకాలు గడ్డాన్ని నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. పైన చెప్పినవి మీ గడ్డానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్​! - Onion Oil Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.