ETV Bharat / health

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

Tips to First Time Makeup: పది మందిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని అమ్మాయిలు తహతహలాడుతుంటారు. అందుకోసం మార్కెట్​లో లభించే వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్​ను ఉపయోగిస్తారు. అయితే.. మేకప్​ వేసుకోవడం తెలిసిన వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ.. మొదటిసారి వేసుకునే వారికి ప్రాబ్లమ్స్ రావొచ్చు. మరి.. అలాంటి వారు ఎలాంటి టిప్స్​ పాటించాలో తెలుసుకోండి.

Tips to First Time Makeup
Tips to First Time Makeup
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 10:46 AM IST

Tips To Get The Best Look For First Time Who Trying Makeup: పార్టీ, పెళ్లి, ఫంక్షన్​ ఏదైనా.. మహిళలు, ముఖ్యంగా యువతులు మేకప్​ లేనిది బయటికి రావడం లేదు. పదిమందిలో అట్రాక్షన్​గా కనిపించాలని మార్కెట్​లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడుతుంటారు. అయితే.. మేకప్​ వేసుకోవడం అందరికీ రాదు. కొద్దిమంది అందులో సూపర్​ ఫాస్ట్​గా ఉంటే.. మరికొద్దిమంది మాత్రం ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఫస్ట్​ టైమ్​ మేకప్​ వేసుకునే వాళ్లు పాటించాల్సిన టిప్స్​ ఏంటో చెబుతున్నారు బ్యూటీషియన్స్​. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి.

స్కిన్​ టైప్​ తెలుసుకోవడం : మేకప్​ వేసుకునేముందు ఫస్ట్​ చేయాల్సింది మీ స్కిన్​ ఏంటో గుర్తించడం. మంచి మేకప్‌కు మంచి బేస్ అవసరం. అది మీ చర్మాన్ని గుర్తించడం నుంచి మొదలవుతుంది. మీ చర్మం డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా మీ ఫేస్​ స్కిన్​ ఎలాంటిదో మీరు గుర్తించాలి. ఇలా చేయడం వల్ల ఏ రకమైన ఉత్పత్తులు మీ ఫేస్​కు బాగా సరిపోతాయో చూజ్​​ చేసుకోవచ్చు.

క్లెన్సర్​తో క్లీనింగ్​: మేకప్ వేసుకునే ముందు.. క్లెన్సర్ సహాయంతో ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత టోనర్ లేదా కాటన్ ప్యాడ్‌తో ముఖాన్ని పూర్తిగా తుడవాలి. ఇలా చేస్తే మీ ముఖం క్లీన్ అవుతుంది. తర్వాత ముఖంపై మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.

రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ టాప్​-7 టిప్స్ మీకోసమే!

ఫౌండేషన్​ : ఫౌండేషన్ మీ చర్మ టోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా చూసుకోండి. SPF కలిగిన ఫౌండేషన్ సూర్యరశ్మి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. ఇప్పుడు కొద్దిగా లైట్ ఫౌండేషన్‌ను తీసుకుని.. ముఖంపై అక్కడ అక్కడ డాట్స్​గా అప్లై చేయాలి. ఇప్పుడు వేళ్లతో సున్నితంగా రుద్దుతూ.. ముఖానికి ఫౌండేషన్‌ను మొత్తం అప్లై చేయాలి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ లేదా చిన్న ఫ్లెమన్‌లను కప్పడానికి కన్సీలర్ ఉపయోగించండి.

ఐ మేకప్: ఫౌండేషన్​ పూర్తైన తర్వాత.. ఐ మేకప్ చేయడానికి, ముందుగా మీకు నచ్చిన ఐ షాడోను ఎంచుకోండి. ఇప్పుడు బ్రష్ సహాయంతో రౌండ్​గా కనురెప్పలకు అప్లై చేయాలి. దీని తర్వాత కళ్లకు ఐలైనర్ రాయండి. చివరిలో కనురెప్పలకు మస్కరా వేయడంతో మీ ఐ మేకప్ పూర్తవుతుంది.

లిప్​స్టిక్​: ఐ మేకప్ వేసుకున్న తర్వాత మీ పెదవులు, బుగ్గలకు లిప్​స్టిక్​ అప్లై చేయండి. ముందుగా బుగ్గలకు బ్లష్ అప్లై చేయండి. ఇప్పుడు మీ దుస్తులను బట్టి పెదవులపై లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ వేయండి. పెదవుల రంగును వేళ్ల సహాయంతో మొత్తం కవర్​ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి.

హైలైటర్‌: ఇప్పుడు దవడ, ముక్కు, నుదుటిని హైలైట్ చేయడానికి హైలైటర్‌ని ఉపయోగించండి. దీని కోసం, అప్‌వర్డ్ స్ట్రోక్‌ని ఉపయోగించడం మంచిదని గుర్తుంచుకోండి. హైలైటర్‌ను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండాలనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. లేకపోతే, అది మీ మేకప్ రూపాన్ని పాడుచేయవచ్చు. చూశారు కదా.. ఎలాంటి టెన్షన్ లేకుండా.. ఈ విధంగా పర్ఫెక్ట్ మేకప్ వేసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.