ETV Bharat / health

చపాతీలు కాసేపటికే గట్టిపడుతున్నాయా? - ఇలా చేస్తే ఎన్ని గంటలైనా మృదువుగా, ఫ్రెష్‌గా ఉంటాయి! - How to Make Soft Chapati - HOW TO MAKE SOFT CHAPATI

Tips And Techniques For Soft Chapatis : ఎన్ని చిట్కాలు ట్రై చేసినా కూడా చపాతీలు మెత్తగా రావడం లేదా? కాసేపటికే గట్టిగా మారుతున్నాయా? అయితే, ఈ టిప్స్ పాటించండి. ఎన్ని గంటలైనా మెత్తగా, ఫ్రెష్​గా ఉంటాయి.

Soft Chapatis
Tips And Techniques For Soft Chapatis (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 5:01 PM IST

Tips And Techniques For Soft Chapatis : ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా చపాతీలు తింటున్నారు. షుగర్ బాధితులు నైట్‌ అన్నం తినడం మానేసి.. చపాతీలను తింటున్నారు. ఇంకా పలు అవసరాల కోసం చపాతీలు తయారు చేసుకుంటారు. అయితే.. చపాతీలు చేస్తే కాసేపటి తర్వాత గాలి తగిలి గట్టిగా మారిపోతుంటాయి. ఎక్కువ మంది ఇదే సమస్య ఫేస్ చేస్తుంటారు. ఇలా ఉండే చపాతీలు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే చపాతీలు మెత్తగా.. మూడు వేళ్లతో తుంచేలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • ఎక్కువ మంది చపాతీలు చేసేందుకు మార్కెట్లో దొరికే ఏదో ఒక పిండి తెచ్చి వాడుతుంటారు. కానీ, చపాతీలు చేసేందుకు స్వచ్ఛమైన గోధుమ పిండి తెచ్చుకోవాలి.
  • వీలైతే గోధుమలను కొని పిండి పట్టించుకుని, చపాతీలు చేసుకుంటే సూపర్​ సాఫ్ట్​గా వస్తాయి. లేకపోతే మార్కెట్​లో మంచి బ్రాండెడ్‌ గోధుమ పిండి ప్యాకెట్‌లను కొనుగోలు చేయండి.
  • చపాతీల పిండి మెత్తగా ఉండాలి. ఒకవేళ బరకగా ఉంటే పిండి జల్లెడపట్టాలి.
  • చపాతీలు చేయడానికి కావాల్సినంత పిండి తీసుకుని అందులో కొంచెం నూనె, గోరువెచ్చని నీరు, కొద్దిగా పాలు పోసి మెత్తగా కలుపుకోండి.
  • పిండి గట్టిగా ఉంటే చపాతీలు కూడా అలానే వస్తాయి. కాబట్టి పిండి మెత్తగా ఉండేలా కలుపుకోండి.
  • చపాతీ పిండి మెత్తగా పిసికిన తర్వాత ముద్దపై కొద్దిగా ఆయిల్‌ రాసి.. ఓ తడి క్లాత్​ను కప్పి సుమారు అరగంట పాటు పక్కన పెట్టుకోండి. దీనివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి.
  • ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండలు రెడీ చేసుకోవాలి.
  • చాలా మంది చపాతీలు పీట మీద చేసేటప్పుడు పొడి పిండిని ఎక్కువగా చల్లుతుంటారు. అయితే, ఇలా ఎక్కువ పొడి పిండి వాడటం వల్ల చపాతీలు గట్టిగా వస్తాయి. కాబట్టి, పొడి పిండిని తక్కువగా వాడండి.
  • మీరు పొడి పిండికి బదులుగా ఆయిల్‌ను పీటపైన రాసి చపాతీలు చేయవచ్చు.
  • చపాతీలు చేసిన తర్వత.. దాన్ని ఫోల్డ్‌ చేసి మరోసారి చపాతీగా చేయాలి. దీనివల్ల చపాతీలు కాల్చేటప్పుడు అవి పొంగుతాయి.
  • చపాతీలు చేసిన వెంటనే వాటిని కాల్చితే.. మెత్తగా వస్తాయి. ఎండిన తర్వాత కాల్చడం వల్ల గట్టిగా వస్తాయి.
  • చపాతీలను కాల్చే పెనం వేడిగా ఉండి.. తక్కువ మంట మీద కాల్చాలి. మంట ఎక్కువ పెట్టడం వల్ల పిండి ఉడికిపోయి.. గట్టిగా వస్తాయి.
  • చపాతీలు కాల్చడానికి నెయ్యి ఉపయోగిస్తే మెత్తగా వస్తాయి.
  • చపాతీలను కాల్చిన తర్వాత వాటిని హాట్​ బాక్స్​లో పెట్టండి. దీనివల్ల అవి చాలా సేపు మెత్తగా ఉంటాయి.

హెచ్చరిక : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? - ఆరోగ్యానికి తీవ్ర ముప్పు - వారానికి ఇంతే తగ్గాలి! - How Much Weight Loss Per Week

కూలర్‌ ఆన్‌లో ఉన్నా కూడా చెమట జిడ్డు వేధిస్తోందా? - అయితే ఇలా చేయండి! - How To Reduce Humidity In Room

పెదవులు జీవం కోల్పోయాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సూపర్ లిప్స్ మీ సొంతం! - Tips for Natural Pink Lips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.