Mistakes To Avoid When Eat Pomegranate : ఎర్రటి రంగు, తియ్యటి రుచి కలిగిన దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టు తీసి, వొలుచుకుని తినడంలో కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ లోపలుండే గింజలు మాత్రం మంచి రుచితో ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని నేరుగా తినడమే కాకుండా సలాడ్స్, సెరల్స్, పండ్ల రసాలు, ఫలూదా వంటి రకరకాల ఆహార పదార్థాల్లో ఉపయెగిస్తుంటారు. దానిమ్మ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే కావడం వల్ల ఎంతో మంది వీటిని ఇష్టంగా తింటున్నారు.
అధ్యయనాల ప్రకారం, దానిమ్మ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, ఆర్థరైటిస్ సమస్యను తగ్గించేందుకు చాలా బాగా సహాయపడుతుందట. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దానిమ్మ పండును కొన్నింటితో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే ఎక్కువ నష్టమే కలుగుతుందట. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్లను ఉపయోగిస్తుంటే దానిమ్మకు చాలా దూరంగా ఉండాలట.
దానిమ్మ కలిగించే లాభాలు:
సంతానోత్పత్తి:
ప్రస్తుతం చాలా మంది గర్భం దాల్చినప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోతున్నారు. సంతాన సమస్యలు ఎదుర్కునే వారు దానిమ్మ గింజల సారం, పండ్ల రసం గర్భంలోని పిండాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఫలితంగా స్త్రీలలో సంతానోత్పత్తి పెరుగుతుంది.
ఆర్థరైటిస్:
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్లో ప్రచురించబడిన 2021 అధ్యయనం ప్రకారం దానిమ్మ తినడం వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి.ఫలితంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గుండె ఆరోగ్యం:
దానిమ్మలు ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆమ్ల జనకాలు చెడు కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగిన తిపోప్రొటీన్లను పెంచుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
దానిమ్మను ఏయే పదార్థాలతో కలపకూడదు?
వార్ఫరిన్:
రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు ఉపయోగించే ఈ ఔషధాన్ని బ్లడ్ థిన్నర్ అని పిలుస్తారు.జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అనాలిసిస్‌లో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం, దానిమ్మ వార్ఫరిన్‌తో సంకర్షణ చెందుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని మరింత పెంచుతుంది.
నైట్రెండిపైన్:
ఇది అధిక రక్తపోటు చికిత్సకు సూచించబడే కాల్షియం ఛానల్ బ్లాకర్. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వాడుతున్న వారు క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం వల్ల ప్రేగులలోని ఔషధ జీవక్రియ తగ్గుతుంది.
తియ్యటి పండ్లు:
దానిమ్మ పండ్లలో యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వీటిని అరటిపండ్లు వంటి తియ్యటి పండ్లతో కలిపి తినడం అస్సలు మంచిది కాదు. ఈ రెండిటినీ కలపడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
స్టాటిన్:
స్టాటిన్స్ అనేది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగించే మందులు. దీన్ని దానిమ్మతో కలపడం వల్ల రాబ్డోమియోలిసిస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే కండరాల కణజాలం విచ్ఛిన్నమై కిడ్నీ దెబ్బతింటుంది.
ACE ఇన్హిబిటర్లు
ఈ మందులు డయాబెటిక్ కిడ్నీలను నివారించడానికి, గుండె వైఫల్యానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దానిమ్మ రసంలో కూడా ఇవే లక్షణాలుండటం వల్ల ఈ రెండిటినీ కలిపి తినడం మంచిది కాదు. వీటి కలయిక మితిమీరిన శక్తినిస్తుంది.ఫలితంగా తలనొప్, కళ్లు తిరగడం వంటి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.