ETV Bharat / health

నాన్​వెజ్ తింటే కొలెస్ట్రాల్ - తినకుండా ఉండలేం ఎలా బ్రో? - ఇవి లాగించండి బ్రో!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:40 AM IST

Cholesterol Reduce Foods : నాన్ వెజ్ తినే వారందరికీ దాదాపుగా వారానికి ఒకసారి కావాల్సిందే. మరికొందరైతే మూడ్నాలుగు రోజులు లాగిస్తుంటారు. ఇలాంటి వారు హై కొలెస్ట్రాల్​తో బాధపడుతుంటారు. తింటే కొవ్వు ఇంకా పెరుగుతుంది. తినకపోతే ఉండలేరు. ఇలా నలిగిపోయేవారు చేపలు తింటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు!

Cholesterol
Cholesterol Reduce Foods

These Foods Reduce Bad Cholesterol : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా.. ఎక్కువ మంది హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్​తో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొందరు ఎలాగైనా బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిలను తగ్గించాలని తీవ్ర కసరత్తులు చేస్తుంటారు. నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేస్తారు. కానీ.. ఎక్కువ కాలం ఉండలేరు. మనసు కోరుతూ ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని చేపలను డైట్​లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

చేపలతోపాటుగా.. తాజా కూరగాయలు, ఫ్రూట్స్, తృణధాన్యాలు నిత్యం తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి బాడీకి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచి అనారోగ్యకరమైన కొవ్వును ఇట్టే తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే.. బాడీలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవాలనుకునేవారు అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకోవడం మంచిదంటున్నారు.

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఈ డ్రింక్స్ తాగారంటే ఐస్​లా కరిగిపోద్ది!

సాల్మన్ ఫిష్ : అధిక కొవ్వుతో బాధపడేవారికి సాల్మన్ ఫిష్ చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్​ను తగ్గిస్తాయి. మొత్తం కొలెస్ట్రాల్ తగ్గడంలోనూ చాలా బాగా సహాయపడతాయి. అలాగే.. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్నీ నివారిస్తాయి. కాబట్టి.. మీ డైట్​లో సాల్మన్ చేపలు ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

టూనా ఫిష్ : ఇందులో కూడా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

ట్రౌట్ ఫిష్ : ఈ చేపలోనూ ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతాయి.

హెర్రింగ్ ఫిష్ : ఈ చేపలు ఈపీఏ, డీహెచ్​ఏ అనే రెండు రకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లను అందిస్తాయి. ఇవి వాపు తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే.. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది.

మాకేరెల్ ఫిష్ : దీనిలో కూడా ఓమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవేకాకుండా.. సార్​డైన్, స్వోర్డ్ చేపలు కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల.. వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు ఈ చేపలు మీ డైట్​లో ఉండేలా చూసుకుంటే హై కొలెస్ట్రాల్​ ప్రాబ్లమ్​ నుంచి బయటపడవచ్చంటున్నారు. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వీటిని కూరగానో, ఉడికించో తినాలి. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో నూనెలో వేయించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.