ETV Bharat / health

అలర్ట్ : ఈ ​అలవాట్లు ఉంటే - మీకు పిల్లలు పుట్టకపోవచ్చు! - Fertility Improve Lifestyle Habits

Best Habits to Boost Fertility : మారిన జీవనశైలి కారణంగా.. ఈ రోజుల్లో ఎంతో మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అలాకాకుండా మీ లైఫ్​స్టైల్​లో ఈ అలవాట్లు మార్చుకున్నారంటే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Habits to Boost Fertility
Fertility
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 3:30 PM IST

Fertility Boosting Lifestyle Habits : ఈ ఆధునిక యుగంలో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటితోపాటు సంతానలేమి కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రకాల కారణాలతో.. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరి.. ఈ పరిస్థితి ఎందుకు పెరుగుతోంది అంటే.. మన జీవనశైలి, అలవాట్లే కారణమని బల్లగుద్ది చెబుతున్నారు నిపుణులు! ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపరచుకోవాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

ధూమపానం, డ్రగ్స్​ : ఈ రెండు సంతానం సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆడవాళ్లు ఇవి తీసుకుంటే.. ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందట. ఎంతగా అంటే.. వీరికి బిడ్డ పుట్టిన తర్వాత.. ఆ బిడ్డ ఎదిగి పెళ్లైన తర్వాత సంతానోత్పత్తిని కూడా ఎఫెక్ట్ చేస్తుందట! కాబట్టి మీ ఫెర్టిలిటీ(Fertility) సామర్థ్యం మెరుగుపడాలంటే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.

మద్యపానం : ఆల్కహాల్ సేవించడం శరీరానికి ఎన్నో విధాల నష్టం చేకూరుస్తుంది. అలాగే ఇది సంతానోత్పత్తికీ అడ్డంకులు కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మద్యపానం తీసుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గడమే కాకుండా ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశాన్ని తగ్గిస్తుందంట. మద్యపానం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.

అధిక బరువు : చురుకైన జీవనశైలిని కలిగి ఉండకపోవడం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలంటున్నారు. భార్యాభర్తల్లో ఒక్కరు బరువెక్కువున్నా కూడా గర్భం ధరించడం కష్టమవుతుందట. ఊబకాయం వల్ల ఏర్పడే హార్మోన్ల అసమతుల్యతతో గర్భం దాల్చడం సవాలుగా మారుతుందట. కాబట్టి హెల్దీ బరువు కోసం రెగ్యులర్​గా వ్యాయామం చేయడం అలవాటును చేసుకోవాలని సూచిస్తున్నారు.

కరోనా వచ్చిన వారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలో సంచలన నిజాలు!

ఆహారం : సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపరచుకోవడంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఇవి సంతానోత్పత్తిని ప్రభావితం చేయడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయంటున్నారు. ఇవి మహిళలో పీరియడ్స్​కు అంతరాయం కలిగించడంతోపాటు.. మగాళ్లలో స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.

కాలుష్య కారకాలు : పర్యావరణ కాలుష్యం కారణంగా.. పురుషులు, మహిళలు ఇద్దరూ సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. పురుగుమందులు, ప్లాస్టిక్‌, శుభ్రపరిచే ఉత్పత్తుల వంటి వాటిలోని రసాయనాలు హార్మోన్ స్థాయిలను గందరగోళానికి గురి చేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల స్త్రీలు గర్భం పొందడం సమస్యగా మారుతుందని సూచిస్తున్నారు.

ఇటీవల 'హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్‌ జర్నల్‌'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గడిచిన 45 ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ 51.6 శాతం మేర తగ్గినట్టు వెల్లడైంది. ముఖ్యంగా జీవన శైలి, పర్యావరణంలోని హానికరమైన రసాయనాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందట. ఇవే కాకుండా.. మానసిక ఒత్తిడి కూడా గర్భధారణపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండేలని సూచిస్తున్నారు.

Planning To Conceive : ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఆ మాత్రల విషయంలో జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.