Best Low Calories Foods : బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. తినే తిండి కూడా చాలా ముఖ్యం. లేదంటే.. వ్యాయమంలో కరిగించిన కొవ్వు మొత్తం.. తినే తిండితో భర్తీ అవుతుంది! ఫలితంగా.. ఎన్నాళ్లైనా బరువు తగ్గరు. అందుకే.. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ బెస్ట్ ఫుడ్స్(Foods) ఏంటో ఇప్పుడు స్టోరీలో తెలుసుకుందాం.
యాపిల్స్ : ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి యాపిల్. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా దీనిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఎంతలా అంటే.. 100గ్రాముల యాపిల్‌లో కేవలం 57 కేలరీలు, మూడు గ్రాముల డైటరీ ఫైబర్ మాత్రమే ఉంటుంది.
స్ట్రాబెర్రీలు : ఈ పండ్లు 150 గ్రాములు తీసుకుంటే.. అందులో కేవలం 50 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇంకా.. విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.
టమాటాలు : మనం డైలీ వివిధ వంటలలో యూజ్ చేసే టమాటాలలో కూడా తక్కువ పరిమాణంలో కేలరీలు ఉంటాయి. సగటు పరిమాణంలో ఉండే టమాటాలో కేవలం 22 కేలరీలు మాత్రమే ఉంటాయట. అలాగే యాంటీఆక్సిడెంట్‌లు, పుష్కలమైన నీటి కంటెంట్ ఉంటుంది.
ఉల్లిపాయలు : వంద గ్రాములు ఉండే నార్మల్ సైజ్ ఉల్లిపాయలో.. కేవలం 44 కేలరీలు కలిగి ఉంటాయని సూచిస్తున్నారు నిపుణులు.
క్యారెట్లు : ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, ఇ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు క్యారెట్‌లో సుమారు 53 కేలరీలు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
బొప్పాయి : తక్కువ కేలరీలు ఉండే ఫుడ్స్‌లో బొప్పాయి కూడా ఒకటి. 140 గ్రాములు ఉన్న ఒక కప్పు బొప్పాయి ముక్కలలో 55 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
ఈ ఫుడ్ ఎంత తింటే - మీ ఆయుష్షు అంత తగ్గిపోతున్నట్టే! - Ultra Processed Food Effects
పాలకూర : ఆకుకూరల్లో రారాజుగా పిలిచే పాలకూరలో కూడా చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. 30 గ్రాములు ఒక కప్పు పాలకూరలో కేవలం 7 కేలరీలు మాత్రమే ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే దీనిలో విటమిన్ K, A, ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు.
2017లో "American Journal of Clinical Nutrition" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పాలకూర తినని వ్యక్తులతో పోలిస్తే.. తినేవారిలో బీపీ, గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో 'లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, పోషకాహార శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డానా ఇ. హన్నెస్' పాల్గొన్నారు. పాలకూర తినడం వల్ల రక్తపోటు, చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
గుమ్మడి విత్తనాలు : దీనిలో కూడా తక్కువ క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 124 గ్రాముుల ఉన్న గుమ్మడి విత్తనాల కప్పులో 18 కేలరీలు మాత్రమే ఉంటాయంటున్నారు.
పుచ్చకాయ : సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా చెప్పుకునే ఈ పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయంటున్నారు నిపుణులు. 152 గ్రాముల పుచ్చకాయ ముక్కలు ఉండే ఒక కప్పులో 46 కేలరీలు ఉంటాయట. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
కీరదోస : ఇవి అధిక నీటి కంటెంట్‌ను కలిగి ఉంటాయి. అలాగే దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 104 గ్రాముల తరిగిన కీరదోస ముక్కలు ఉన్న కప్పులో కేవలం 16 కేలరీలను కలిగి ఉంటాయట.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.