ETV Bharat / health

ప్రెషర్ కుక్కర్​లో - ఈ ఆహారాలు ఎప్పుడూ వండకూడదు! - Pressure Cooker Disadvantages

Avoid These Foods Cooking in Pressure Cooker: ప్రస్తుతం చాలా మంది వంట త్వరగా పూర్తి కావాలని ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా? అయితే.. అందులో ఎప్పుడూ వండకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..

Pressure Cooker
Avoid These Foods Cooking in Pressure Cooker
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:15 PM IST

These Foods Should Never Cooked in Pressure Cooker: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జనాలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వంట త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో ప్రెషర్​ కుక్కర్​ను ఉపయోగిస్తున్నారు. అయితే.. అందులో ఎప్పుడూ వండకూడని కొన్ని ఆహారాలు(Foods) ఉన్నాయని మీకు తెలుసా? వాటిని ప్రెషర్​ కుక్కర్​లో వండడం ద్వారా అవి రుచిని కోల్పోవడమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఇంతకీ.. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సీఫుడ్ : మీరు ఎప్పుడూ ప్రెషర్​ కుక్కర్​లో సీఫుడ్ వండకూడదు. అందులో ముఖ్యంగా సున్నితమైన చేపలు, రొయ్యలు వంటివి ఉండికించకూడదు. ఎందుకంటే అవి ప్రెషర్ కుక్కర్ ఆవిరికి త్వరగా ఉడికి మెత్తగా మారుతాయి. ఆకృతిని, రుచిని కోల్పోతాయి.

ఫ్రైడ్ ఫుడ్స్ : కరకరలాడే వడలు లేదా ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ప్రెజర్​ కుక్కర్​లో వండకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. మీరు ఓపెన్ మూతతో ఉడికించినా ఆశించినంత ఫలితం ఉండదు. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్​లో ఆహారాలు ఆవిరి మీద ఉడుకుతాయి. అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కుక్కర్​లో వండితే టేస్ట్ కోల్పోతాయి.

పాస్తా : మీరు ప్రెజర్​ కుక్కర్​లో ఎప్పుడూ వండకూడని మరో ఆహార పదార్థం పాస్తా. ఎందుకంటే అందులో పాస్తా అతిగా ఉడకడం వల్ల అది అధిక సాచురేటెడ్ కంటెంట్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడూ పాస్తాను ఒక కుండలో లేదా మరేదైనా పద్ధతిని ఉపయోగించి పాస్తాను విడిగా ఉడికించడం ఉత్తమం.

పాల సంబంధిత ఉత్పత్తులు : పాడి ఆధారిత రుచికరమైన వంటకాలు, సాస్‌లు చేయడానికి ప్రెజర్​ కుక్కర్ ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే పాల సంబంధిత ఉత్పత్తులు ప్రెజర్​ కుక్కర్​లోని అధిక పీడనం, ఉష్ణోగ్రత కారణంగా అవి రుచిని, ఆకృతిని కోల్పోతాయి. పాలు, జున్ను లాంటివి దానిలో వేడి చేయడం వలన త్వరగా విరిగిపోతాయి. ఒకవేళ వీటిని తీసుకున్నా ఆరోగ్యం పాడవుతుంది.

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

ఆకుకూరలు : వీటిని కూడా ప్రెషర్​ కుక్కర్​లో వండకపోవడం బెటర్. చాలా త్వరగా మెత్తగా ఉడికి విచ్ఛిన్నం అవుతాయి. ఫలితంగా రుచిని కూడా కోల్పోతాయి. కాబట్టి.. ఆకుకూరలను ఎప్పుడూ కుక్కర్​లో ఉండకుండా వేరే మార్గాలను ఉపయోగించి విడిగా ఉడికించడం మంచిది.

పండ్లతో కూడినవి : పండ్లతో కూడిన వంటకాలకూ కుక్కర్ ఉపయోగించకపోవడం మంచిది. వీటిని కుక్కర్​లో వండినప్పుడు అధిక ఒత్తిడికి త్వరగా ఉడికి చాలా మెత్తగా మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని తినడానికి ఇబ్బంది ఉండడంతో పాటు టేస్ట్ మారిపోతుంది.

వీటితో పాటు బ్రెడ్ డిలైట్స్, కేక్​లు, కుకీస్ వంటి వాటిని ప్రెజర్​ కుక్కర్​లో వండకూడదు. దీనికి బదులుగా బేకింగ్ కోసం సాంప్రదాయ ఓవెన్​ని యూజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

మీరు వెజిటేరియనా?.. మరి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.