ETV Bharat / health

షుగర్ పేషెంట్స్ ఉపవాసం చేయొచ్చా? ఫాస్టింగ్​తో కలిగే బెనిఫిట్స్ ఏంటి? - IS IT HEALTHY FOR DIABETICS TO FAST

-మధుమేహం బాధితులు ఉపవాసంతో చేస్తే ఏం అవుతుంది? -మిగతవారు ఫాస్టింగ్ చేస్తే లాభాలు ఉంటాయన్న నిపుణులు

Sugar Patient Can do Fasting
Sugar Patient Can do Fasting (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 5, 2024, 1:20 PM IST

Sugar Patient Can do Fasting: ఉపవాసం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉపవాసంతో బరువు తగ్గడమే కాకుండా.. శరీరంలో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని Cell Metabolism జర్నల్​లో తేలింది. "Early Time-Restricted Feeding Improves Insulin Sensitivity, Blood Pressure, and Oxidative Stress Without Weight Loss in Humans." అనే పేరిట జరిగిన అధ్యయనంలో University of Alabama at Birmingham పరిశోధకులు Erin F. Sutton పాల్గొన్నారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రోజులో లేదా వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతున్నాయని.. అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు నిర్థరించారు. దీంతో పాటు అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధుమహంతో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా? అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం బాధితులు సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అని పిలుస్తుంటారని తెలిపారు. ఈ సమయంలో వీరి శరీరం పిండిపదార్థాలు తీసుకుంటున్నా కూడా కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుందన్నారు. ఫలితంగా ఈ స్థితిలో 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అనేది బాగా పెరుగుతుందని వివరించారు. ఇదే 6 గంటలకంటే ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తినకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరి శరీరంలో ఎసిటాల్డిహైడ్‌, ఎసిటోన్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయని తెలిపారు. ఈ పరిస్థితినే కీటోన్‌ బోడీస్‌ అని అంటుంటారు.

శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతిని క్రమేపీ అవి విఫలమైపోతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ అవసరమై.. గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారని వివరించారు. ఇలా మధుమేహులు ఎప్పుడైనా గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారని పేర్కొన్నారు. అందుకోసమే షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరమని సూచిస్తున్నారు. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని.. దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి షుగర్ లేనివారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్​లో​ ఉన్నవారు అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కళ్లద్దాలు రోజు పెట్టుకుంటే చూపు మందగిస్తుందా? సైట్ వస్తే తగ్గించుకోవచ్చా? కళ్లకు ఏం తింటే బెస్ట్?

రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? ఇలా తింటే ఏమవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.