ETV Bharat / health

కడుపుబ్బరంగా అనిపిస్తుందా? సమస్యకు ఫుల్​స్టాప్​ పెట్టండిలా! - Solution For Stomach Bloating - SOLUTION FOR STOMACH BLOATING

Solution For Stomach Bloating : మనలో చాలామందికి అప్పుడప్పుడు కడుపుబ్బరంగా అనిపిస్తుంది. కడుపు నొప్పి లేకపోయినా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు తిన్న ఆహారం వాంతి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు కడుపుబ్బరం ఎందుకు వస్తుంది? దీనిని నివారించడానికి వైద్యులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Get Rid Of Stomach Bloating
Get Rid Of Stomach Bloating
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 10:31 AM IST

Solution For Stomach Bloating : మనం తీసుకున్న ఆహారం కొన్నిసార్లు వాంతుల రూపంలో వెనక్కి వచ్చేస్తుంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా తిన్న ఆహారం కాస్త పుల్లగా లేదంటే కారంగా బయటకు వస్తుంది. అదే సమయంలో కడుపుబ్బరంగా కూడా అనిపిస్తుంటుంది. దీని వల్ల ఆహారం తినలేకపోవడం జరుగుతుంది. అసలు కడుపుబ్బరం ఎందుకు వస్తుంది? దానికి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కడుపుబ్బరం ఎందుకు వస్తుందంటే
Why Stomach Bloating Occurs : కడుపుబ్బరం అనేది ఒక రకమైన పోషకాహార సమస్యగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మనం తినే ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది. అయితే ఆహారవాహికకు, జీర్ణాశయానికి మధ్యన ఆహారం తిరిగి వెనక్కి రాకుండా ఒక స్ప్రింకర్​ ఉంటుంది. కొన్నిసార్లు ఇది సరిగ్గా మూసుకోకపోయినా లేదంటే గట్టిగా లేకపోయినా ఆహారం వెనక్కి వచ్చేస్తుంటుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా.అంజలీదేవి వివరిస్తున్నారు. ఫలితంగా ఆహారం పులుపు లేదా కారంగా మారి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు. దీని వల్ల కడుపుబ్బరంగా అనిపిస్తుందని అంటున్నారు.

కడుపుబ్బరానికి నివారణ ఏంటంటే
కడుపుబ్బరం నుంచి విముక్తి పొందాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా వరకు క్యాల్షియం లోపించడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని గనుక క్యాల్షియం సరైన మోతాదులో శరీరానికి అందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, వెన్న, ఇతర పాలతో తయారైన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్యను నివారించవచ్చని అంటున్నారు.

ఈ ఆహారాలకు దూరం!
అలాగే ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల స్ప్రింకర్​ త్వరగా మూసుకుపోయే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని అంటున్నారు. ఆహారాన్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా తీసుకోవడం మేలు చేస్తుందని వివరిస్తున్నారు. అలాగే ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాలు, నూనెల్లో అతిగా వేయించిన ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, లావుగా ఉన్న పెద్ద ముక్కలను తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలా కాకుండా త్వరగా జీర్ణమయ్యే, అన్ని రకాల పోషకాలు లభించే ఆహారాలు తినాలని చెబుతున్నారు. అలాగే పొట్టులేని చిరుధాన్యాలు తినడం ద్వారా కూడా కడుపుబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గబగబా తినేస్తున్నారా? ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త! - eating fast problems

తలలో దురదగా ఉందా? కలబంద గుజ్జుతో ఇలా చేస్తే అంతా సెట్​! - How To Reduce Itchy Scalp

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.