ETV Bharat / health

అలర్ట్ : చర్మ సౌందర్యం కోసం ఐస్ ఫేషియల్​ వాడుతున్నారా? - ఇది తెలుసుకోకపోతే అనర్థాలు తప్పవు! - Side Effects Of Using Ice On Skin - SIDE EFFECTS OF USING ICE ON SKIN

Side Effects Of Using Ice On Skin : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం విషయంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఐస్ ఫేషియల్స్ ట్రై చేస్తుంటారు. అలాంటి వారికి బిగ్ అలర్ట్! చర్మంపై ఐస్ ఎక్కువ సేపు రాయడం వల్ల జరిగే నష్టం ఎవరూ పూడ్చలేనిదని నిపుణులు అంటున్నారు.

Side Effects Of Using Ice Cubes On Skin
Side Effects Of Using Ice On Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 10:33 AM IST

Side Effects Of Using Ice Cubes On Skin : ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యం కోసం ఐస్ ఫేషియల్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే.. ఐస్ క్యూబ్స్, ప్యాక్స్​తో నేరుగా చర్మంపై మర్దన చేసుకోవడం. ప్రస్తుతం ఈ ట్రెండ్​ను చాలా మంది ఫాలో అవుతున్నారు. దీని వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చని భావిస్తుంటారు. నిజానికి ఐస్ ఫేషియల్స్ వల్ల చర్మానికి కొంతమేర ప్రయోజనం ఉన్నప్పటికీ.. అతిగా వాడితే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, చర్మానికి(Skin) ఐస్ రాయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐస్​ని కేవలం ఫేషియల్స్ కోసం మాత్రమే కాదు కొందరు.. ఏదైనా గాయాలు అయినప్పుడు, మొటిమలు, ముఖం, కళ్ల వద్ద చర్మం ఉబ్బినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి యూజ్ చేస్తుంటారు. అయితే, ఇలా ఐస్​ని యూజ్ చేసే వారందరూ ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఐస్​ సంబంధిత క్యూబ్స్, రోలర్లు, ప్యాక్స్ వంటి ఎక్కువ వాడకుండా చూసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. వీటిని అధికంగా వాడడం వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అవేంటంటే..

ర్యాషెస్ : అధిక సమయం పాటూ పదే పదే ముఖంపై ఐస్ క్యూబులతో మసాజ్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మం ఎరుపుగా మారి దురదలు, ర్యాషెస్ వంటి ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు. 2010లో "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఐస్ ప్యాక్‌లను ఎక్కువసేపు ముఖంపై ఉంచడం వల్ల చర్మవాపు, దురద, చర్మానికి నష్టం కలగడం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో యూనివర్సిటీ ఆఫ్ కెంట్​లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ రెడ్మోండ్ పాల్గొన్నారు. ఎక్కువ సమయం ఐస్ క్యూబ్స్ చర్మంపై అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

దీర్ఘకాలిక చర్మ సమస్యలు : ఐస్ క్యూబ్స్ అధికంగా వాడడం వల్ల చర్మం కింద ఉండే రక్త కేశనాళికలు చిట్లిపోయి స్కిన్​పై ఎర్రటి మచ్చలు రావచ్చంటున్నారు నిపుణులు. దీని కారణంగా దీర్ఘకాలిక చర్మ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. స్కిన్ సున్నితంగా ఉన్న వారిలో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.

ఆ వ్యాధులు మరింత తీవ్రమవుతాయి : ఎగ్జీమా, మొటిమలు, ఇంకేవైనా దీర్ఘకాలిక చర్మ సమస్యలున్నవారు ఐస్ పెట్టుకోవడం వల్ల అవి మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోయి స్వేదం బయటికి రాకుండా స్కిన్ కిందనే ఉండిపోయే ఛాన్స్ ఉంది. దాని వల్ల చర్మ సంబంధిత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. చర్మం మీద ముడతలు, సన్నటి గీతలు ఏర్పడడం, స్కిన్ సాగిపోయే లక్షణాన్ని కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు.

కాబట్టి, చర్మ సౌందర్యం కోసం ఐస్ పెట్టడం ఒక్కటే మార్గం కాదనే విషయాన్ని గమనించాలి. సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి స్కిన్ కేర్ రొటీన్, జీవనశైలిని ఫాలో అవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.