ETV Bharat / health

అలర్ట్​: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - థైరాయిడ్​ కావొచ్చు - వెంటనే చెక్ చేసుకోండి! - Symptoms Of Thyroid - SYMPTOMS OF THYROID

Signs Of Thyroid Issues : ఇటీవల కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందులో థైరాయిడ్​ సమస్య ఒకటి. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రాబ్లమ్​ అధికంగా కనిపిస్తోంది. అయితే, థైరాయిడ్​ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.

Thyroid Issues
Signs Of Thyroid Issues (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 12:24 PM IST

Thyroid Symptoms : మన శరీరంలో ఎన్నో అవయవాలు, విభాగాలుంటాయి. వీటిలో థైరాయిడ్​ వ్యవస్థ కీలకంగా పని చేస్తుంది. మన జీవక్రియల్ని క్రమబద్ధం చేసే.. అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. సీతకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్​ గ్రంథి.. శరీర అవసరం మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ జీవక్రియల్ని సక్రమంగా జరిగేలా చూస్తుంది. అయితే, ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్​ ఎక్కువైనా, తక్కువైనా కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. థైరాయిడ్​ సమస్య వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో హైదరాబాద్​కు చెందిన ప్రముఖ డయాబెటాలజిస్ట్​ డాక్టర్​ పి.వి. రావు వివరిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్​ సమస్యలను రెండు రకాలుగా విభజించారు. అవసరమైన దాని కంటే.. థైరాయిడ్​ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితిని హైపర్​ థైరాయిడిజమని (Hyperthyroidism), సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్​ హార్మోన్​ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) పిలుస్తారు.

థైరాయిడ్​ లక్షణాలు :

  • ఈ సమస్యతో బాధపడేవారిలో తీవ్రమైన అలసట ఉంటుంది.
  • అలాగే వేగంగా బరువు పెరుగుతారు. థైరాయిడ్​ హార్మోన్స్​ తగ్గితే శరీరం వెయిట్​ పెరుగుతుంది. దీన్ని హైపో థైరాయిడిజమని అంటారు.
  • థైరాయిడ్​ హార్మోన్స్ పెరిగితే ఒక్కసారిగా శరీర బరువు తగ్గుతుంది. దీన్ని హైపర్​ థైరాయిడిజమని అంటారు.
  • జుట్టు రాలిపోతుంది.
  • అధికంగా చెమట పడుతుంది.
  • ఈ వ్యాధికి సంబంధించి బయటకు కనిపించే లక్షణాలలో మెడ ఉబ్బడం ఒకటి. థైరాయిడ్​ గ్రంథి మార్పుల వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది.
  • థైరాయిడ్​ సమస్య తలెత్తినప్పుడు శరీర ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తుంది. ఒక్కసారిగా పెరగడమో, తగ్గడమో కనిపిస్తుంది. ఎక్కువ చలిగానో లేదా ఎక్కువ వేడిగానో అనిపిస్తుంది.
  • చర్మం పొడిబారుతుంది.
  • గోర్లు పెలుసుగా మారతాయి.
  • కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి.
  • చేతులు జలదరింపులకు గురవుతాయి.
  • మలబద్ధకంతో బాధపడతారు.
  • అసాధారణ రుతుస్రావం వంటివి అన్నీ కూడా హైపోథైరాయిడ్​ లక్షణాలను డాక్టర్​ పి.వి రావు చెబుతున్నారు.

థైరాయిడ్​కు, బరువు పెరగడానికి సంబంధమేంటి?

హైపర్​ థైరాయిడ్​ లక్షణాలు :

  • కండరాల బలహీనత లేదా చేతులు వనకడం
  • దృష్టి సమస్యలు
  • విరేచనాలు
  • క్రమరహిత రుతుచక్రం
  • థైరాయిడ్​ వ్యాధి రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది.
  • హైపోథైరాయిడ్​ కారణంగా కొవ్వు అధికంగా పెరిగి హార్ట్​స్ట్రోక్​ వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • కొన్నిసార్లు తక్కువ హార్మోన్ల కారణంగా స్పృహ తప్పే అవకాశం ఉంటుంది.
  • హైపోథైరాయిడ్​ సమస్య ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారు వైద్యులను కలిసి.. వారు సూచించిన మందులను డైలీ వాడుకోవాలని డాక్టర్​ పి.వి రావు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే థైరాయిడ్​ కావొచ్చు!

థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్​తో అదుపులోకి రావడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.