Side Effects of Eating Chicken Everyday : నాన్‌వెజ్ ప్రియుల్లో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. రోజూ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, చికెన్ 65 వంటి వెరైటీలను చేసుకుని తినే అంతా. అయితే, మనం ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు, కూరగాయలను తినడం ఎంత ముఖ్యమో, మాంసాహారం తినడం కూడా అంతే ముఖ్యం. అలా అని రోజూ కోడి మాంసం తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. డైలీ చికెన్ తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డైలీ చికెన్ తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు :
అధిక రక్తపోటు వచ్చే ఛాన్స్ : రోజూ చికెన్ తినడం వల్ల మన బాడీలో కొవ్వు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే మన శరీరంలో సోడియం శాతం కూడా అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. స్కిన్ లెస్ చికెన్ కన్నా.. స్కిన్ ఉన్న చికెన్ తినడం వల్ల ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సోడియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.
2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, రోజూ చికెన్ తినే వ్యక్తులకు రక్తపోటు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోషకాహార ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్. ఫ్రాంక్ బావో పాల్గొన్నారు. డైలీ చికెన్ తింటే రక్తపోటు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, రోజుకు 50 గ్రాములకు మించి చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
కళ్లు ఉప్పు వాడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా! - Amazing Benefits of crystal salt
గుండె సంబంధిత సమస్యలు : చికెన్ రోజూ ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని.. దీనివల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు పెరుగుతారు : చికెన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని రోజూ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రై చికెన్ తింటే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, వీటి తయారీలో నూనె, మసాలాలు, ఇతర కొవ్వు పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తున్నారు.
- చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అయితే, ప్రతిరోజు కోడి మాంసం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
- కోడి మాంసం తినడం వల్ల బాడీలో వేడి ఎక్కువగా చేరుతుంది. ఇంకా రోజూ తింటే శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని నిపుణులంటున్నారు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.