ETV Bharat / health

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టే!

Schizophrenia Causes and Symptoms: గతంతో పోలిస్తే.. మానసిక సమస్యలు ప్రస్తుతం తీవ్రమయ్యాయి. ముఖ్యంగా డిప్రెషన్, సైకోసిస్ లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు వయసు, జెండర్​తో సంబంధం లేకుండా బలైపోతున్నారు. అలాంటి తీవ్రమైన మానసిక వ్యాధుల్లో స్కిజోఫ్రెనియా ఒకటి. అసలు ఈ వ్యాధి ఏంటి..? లక్షణాలు ఏంటి..? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Schizophrenia Causes and Symptoms
Schizophrenia Causes and Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 1:32 PM IST

Schizophrenia Causes and Symptoms: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్​ సాధించడానికి మనిషి లైఫ్‌‌‌‌ స్టైల్​లో అనేక మార్పులు మొదలయ్యాయి. అయితే ఈ స్పీడ్‌‌ను అందుకోవడంలో కొంత మంది ఇబ్బంది పడుతుంటారు. కాంపిటీషన్, స్ట్రెస్‌‌ తట్టుకోలేక.. తీవ్రమైన యాంగ్జైటీకి గురై.. శారీరక, మానసిక రుగ్మతల బారినపడతారు. దీంతో.. తన బతుకు ఇంతే అనే ఒక రకమైన భావనలోకి వెళ్లిపోతారు. తమదైన ఒక ప్రపంచాన్ని ఊహించుకుని, వింత ప్రవర్తనలతో బతికేస్తుంటారు. ఈ స్థితిని స్కిజోఫ్రెనియా అంటారు. ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలో అర్థం కాక, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది.

ఏ వయసు వారిలో..

స్కిజోఫ్రెనియా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల మందిని లేదా ప్రతి 300 మందిలో ఒకరిని (0.32%) ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి.. వాస్తవ ప్రపంచానికి, పరిస్థితులకు దూరంగా జీవిస్తుంటారు. వయసు, జెండర్​, వృత్తి పరంగా ఎటువంటి సంబంధం లేకుండా.. ఎవరైనా సరే ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంది. ఒకవేళ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ఈ వ్యాధి బారినపడితే, అది జీవితాంతం పీడించే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి రావడానికి కారణాలు..

  • స్కిజోఫ్రెనియా రావడానికి నిర్ధిష్టమైన కారణమేమిటో ఇప్పటి వరకూ స్పష్టం కాలేదు.
  • అయితే జన్యుపరమైన, పర్యావరణ, బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ వ్యాధి రావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
  • అలాగే మెదడులో ఉండే డోపమైన్, గ్లూటమేట్, సెరటోనిన్ లాంటి న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్‌‌ వల్ల మనిషి సాధారణ ఆలోచనా విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి.
  • టీనేజ్‌‌, యవ్వనంలో సైకోయాక్టివ్, సైకోట్రోపిక్ మందులు తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్‌‌ కెమికల్స్‌‌లో మార్పులు రావొచ్చు.
  • విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి చేసే కొన్ని సంఘటనలు కూడా ఈ వ్యాధి బారినపడడానికి కారణం కావచ్చు.
  • వంశపారం పర్యంగా కూడా పెద్దల నుంచి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
  • పోషకాహార లోపం, మెదడు ఎదుగుదలను ప్రభావితం చేసే టాక్సిన్స్, వైరస్‌‌లకు గురికావడం, గర్భంలో ఉన్నప్పుడు బ్రెయిన్ గ్రోత్ సరిగా లేకపోవడం లాంటి సమస్యలు కూడా స్కిజోఫ్రెనియాకు ఒక కారణమే.

ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారా? - ఈ సమస్య నుంచి ఇలా గట్టెక్కండి!

స్కిజోఫ్రెనియా లక్షణాలు:

  • ఈ వ్యాధి బారిన పడిన వారిలో నిద్రలేమి, ఒంటరితనం, భయం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
  • ఒక్కోసారి గ్యాప్ ఇవ్వకుండా ఏవో అర్థంలేని, సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతారు.
  • ఒక విషయానికీ, మరో విషయానికీ పొంతన లేకుండా మాట్లాడుతూ తమకు భయం లేదన్నట్టు కనిపిస్తారు.
  • బంధువులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులు తనను రహస్యంగా పరిశీలిస్తున్నారన్న తప్పుడు అభిప్రాయంతో.. వారిని నమ్మలేక అనుమానం, అభద్రతతో బతుకుతుంటారు.
  • ఎవరో కొందరు తనను వెంబడిస్తున్నారని, విష ప్రయోగం చేయబోతున్నారని, చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఏదో తెలియని భయంలో ఉంటారు.
  • రోగి తనలో తాను నవ్వుకుంటూ, తను ఊహించుకున్న వ్యక్తులతో సంభాషణలు చేస్తుంటారు.
  • వ్యాధి తీవ్రత పెరిగితే కొన్ని సందర్భాలలో స్నానం చేయడం మానేసి మురికిగా కనిపించడం, బట్టలు కూడా సరిగా వేసుకోకుండా తిరగడం చేస్తుంటారు.

చికిత్స ఎలా: పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించండి. స్కిజోఫ్రెనియా మొదటి దశ అయితే మందులతో నియంత్రించవచ్చు. రోగిని పరీక్షించిన తర్వాత ఎంత కాలం మందులు వాడాల్సి ఉంటుంది? కుటుంబ సభ్యులు ఎలా మెలగాలి? అన్నది వారు చెబుతారు. వెంటనే చికిత్స ఆరంభిస్తే వ్యాధి ఎక్కువ కాకుండా.. మళ్లీ మళ్లీ రాకుండా చూడొచ్చు.

కంటికి కనిపించని 'ఒత్తిడి'తో పోరాడుతున్నారా.. ఇలా జయించండి..

మనసు పాడు చేసుకుంటున్నారా ఈ టిప్స్ మీకోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.