Relationship Tips for Mother in-law and Daughter in-Law: తల్లీకూతుళ్లలా మెలిగే అత్తాకోడళ్లు ఉన్నారు. బద్ధశత్రువుల్లా బిహేవ్ చేసే అత్తాకోడళ్లు కూడా ఉన్నారు. అయితే.. వీరిద్దరి మధ్యా నిజమైన కారణాలకన్నా.. కేవలం "అహం"తో వచ్చే గొడవలే అధికంగా ఉంటాయన్నది నిపుణులు చెబుతున్న మాట. కానీ.. కారణాలు ఏవైనప్పటికీ విభేదాలు, వివాదాల కారణంగా నరకంగా మారేది మీ ఇల్లే. నలుగురిలో నవ్వులపాలయ్యేది మీ కుటుంబమే. అందుకే.. అత్తవారింట్లో కోడళ్లు ఎలా ప్రవర్తించాలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
చెప్పిన పని చేయడం రాదంటూ కొందరు అత్తలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. నిత్యం ఇదే పరిస్థితి వస్తే కోడళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్రమంలో వేరుకాపురం పెట్టాలనే ఆలోచన కూడా చేస్తుంటారు కొందరు. దీనివల్ల మరికొన్ని కొత్త సమస్యలు రావొచ్చు. అందుకే.. కోడళ్లు కాస్త వివేకంతో వ్యవహరించి, సమస్యను పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని టిప్స్ ఇస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రియాక్ట్ కావొద్దు : అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న కోడళ్లు.. మానసిక దూరం పాటించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మీ అత్తగారు నెగటివ్‌గా మాట్లాడుతూ మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తుంటే కొంచెం ఓర్పుతో ఉండమంటున్నారు. అత్త మాటలకు రియాక్ట్ కావడానికి బదులుగా.. అందులో వాస్తవం ఉందా? అని ఆలోచించుకోవాలని సలహా ఇస్తున్నారు. మీలో పొరపాటు ఉంటే సరిచేసుకోండి. లేదంటే వదిలేయండి. ఇది మనసుకు ప్రశాంతత, విశ్రాంతిని అందిస్తుందని అంటున్నారు.
వాదించొద్దు: మీ అత్తతో ఏ విషయాల్లోనూ వాదించవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇంట్లోనూ, వయసులోనూ కోడలికన్నా తానే ఎక్కువ అనే ఫీలింగ్‌లో అత్తగారు ఉంటారు. కాబట్టి.. వాదించొద్దని సూచిస్తున్నారు. అలా చేస్తే అత్తా కోడళ్ల మధ్య సంబంధం మరింత క్షీణిస్తుందని.. చివరకు ఇది మీ భార్యాభర్తల మధ్య బంధంపైనా ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. అత్తగారితో వాదనకు దిగకుండా అడిగినదానికి మామూలుగా సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు.
జీన్స్ వేసుకోమంటున్న అత్త- చీరలే కట్టుకుంటానన్న పల్లెటూరి కోడలు- పోలీస్‌స్టేషన్‌కు పంచాయతీ!
కాన్ఫిడెంట్‌గా ఉండండి : అత్తగారు, మీ కుటుంబ సభ్యులపైనా, మీపైనా ఏవైనా నెగెటివ్ కామెంట్స్ చేయడం, చిరాకు పడటం చేసినప్పుడు.. మీరు కుంగిపోకూడదని సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ కాన్పిడెంట్‌గా ఉండాలని చెబుతున్నారు. దీంతో.. మీ బలమైన వ్యక్తిత్వం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు.
వెయిట్ చేయండి : అత్తగారు కోప్పడుతుంటే.. ఆమె అలా అనడం సరైనదేనా? కాదా? అనే విషయం మీ మనసుకు తెలుస్తుంది. ఆమె కోపానికి అర్థం ఉందంటే మీరు పొరపాటు చేశారని అర్థం. అప్పుడు మీ పొరపాటును సరిద్దుకోవాలి. అలాకాకుండా.. కారణం లేకుండా ఊరికే తిడుతూ ఉంటే వాళ్లది నెగెటివ్ మైండ్ సెట్ అని అర్థం. ఇలాంటి వాళ్లకు మారడానికి కాస్త టైమ్ ఇవ్వండి. మీరు సహనంగా ఉండండి. అయినప్పటికీ మారకపోతే.. మీరు ఆమెపై ఓ క్లారిటీకి వచ్చి.. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. అంతే తప్ప, మదనపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు.
త్తాకోడళ్లు తల్లీకూతుళ్లలా మెలగాలా? ఇలా చేస్తే నిత్య సంక్రాంతే!
మా కోడలు ఇంట్లో ఏ పనీ చేయట్లేదు ఏం చేయాలి? - నిపుణుల సమాధానం ఇదే! - Family Problems Suggestions