Red Meat Vs Nuts : మనలో చాలా మందికి మాంసం లేనిదే ఆహారం రుచించదు. రోజులో కనీసం ఏ ఒక్కసారైనా ముక్క తిననిదే ముద్ద దిగదన్నట్లు ఉంటాం. అయితే నాన్ వెజ్ ప్రియులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక్కో రకమైన మాంసం ఒక్కో ప్రమాదంలోకి నెట్టేస్తుందట. ముఖ్యంగా రెడ్ మీట్ తినేవారిలో జ్ఞాపక శక్తి వయస్సు కంటే ఎక్కువగా తగ్గిపోతుందట.
ఇక్కడ రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మేక మాంసం, గొర్రె మాంసం, గుర్రం మాంసం లాంటివన్నీ అవే కేటగిరీకి వస్తాయి. ఈ మాంసం తినే వారు దీర్ఘ కాలికంగా డెమెన్షియా సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. జులై 31న అల్జీమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ విడుదల చేసిన స్టడీ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
లక్షా 30వేల మందిపై జరిపిన ఈ స్టడీలో రెడ్ మీట్ తిన్న వారు జ్ఞాపకాలతో పాటు భాషపై పట్టు, సమస్యలను పరిష్కరించే విధానం వంటి విషయాల్లో వెనుకబడినట్లు తెలిసింది. ఇతరులతో పోల్చుకుంటే వీరిలోనే న్యూరో డీజనరేటివ్ కండీషన్ అనేది ఎక్కువగా కనిపించిందట. మెదడులోని కణాలు డ్యామేజ్ కు గురికావడంతో పాటు సుదీర్ఘ కాలం సరిగా పనిచేయనట్లు తెలిసింది. ఇవన్నీ డెమన్షియా లక్షణాలే.
అసలు రెడ్ మీట్ తినడం వల్ల డెమెన్షియా వచ్చేది ఎందుకంటే?
రెడ్ మీట్‌లో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనుల్లో కొవ్వు పేరుకునేలా చేస్తుంది. ఫలితంగా అథోస్లేరోసిస్‌కు గురై మెదడుకు రక్త సరఫరాను నెమ్మెది చేస్తుంది. అలా చేయడం వల్ల మెదడులోని కణాలకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ చేరుకోవడం ఆలస్యమవుతుంది. అలా జ్ఞాపకశక్తి తగ్గిపోయి డెమెన్షియాకు గురయ్యే ప్రమాదముంది. సాధారణంగానే రెడ్ మీట్ తినే వారిలో గుండె జబ్బులకు గురయ్యే వారు ఎక్కువ. దాని వల్ల రక్తనాళాలతో పాటు బ్రెయిన్‌కు కూడా ప్రమాదముంటుందట.
ఈ స్టడీలోనే బయట పడ్డ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రెడ్ మీట్ తింటూనే పప్పులు, గింజలు తీసుకునే వారిలో మాత్రం మంచి ఫలితాలు కనిపించాయి. కేవలం రెడ్ మీట్ మాత్రమే తీసుకునే వారి కంటే వీరిలో డెమెన్షియాకు గురయ్యే అవకాశాలు 20శాతం తక్కువగా నమోదయ్యాయి. దీని బట్టి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే ఏం తీసుకోవాలో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చే ఉండాలి.
పిస్తా పప్పులు తింటే మీ బాడీలో ఏం జరుగుతుంది? రోజుకు ఎన్ని తినాలి? - Pista Benefits In Telugu
చిప్స్ టు వైన్- ఆరోగ్యానికి మేలు చేసే అన్‌హెల్తీ ఫుడ్స్ ఇవే! - Benifits With Unhealthy Foods