ETV Bharat / health

మీ బాణపొట్టకు కారణం తిండి కాదు- మీరు చేసే ఈ చిన్న తప్పులేనట! - షాకింగ్ రీసెర్చ్! - Belly Fat Causes

Reasons For Belly Fat : జుట్టు ఊడిపోతే మళ్లీ రాదని.. ఒకసారి పొట్ట వస్తే పోదని.. చాలా మంది సరదాగా అంటుంటారు! వినడానికి కాస్త వింతగా అనిపిస్తున్నా చాలా వరకు ఇది నిజం! అయితే, ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్​ వస్తోంది. అసలు పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం..

Belly Fat
Reasons For Belly Fat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 10:50 AM IST

Belly Fat Causes : ఇటీవల కాలంలో చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్​ని తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు డైట్​ పాటించినా కూడా, కొందరిలో పొట్ట తగ్గదు..! బెల్లీ ఫ్యాట్​ అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చాలా మందికి అసలు పొట్ట ఎందుకు వస్తుందో తెలియదు ? ఎక్కువగా తినడం వల్లే బెల్లీ ఫ్యాట్​ వస్తుందని అనుకుంటుంటారు. అయితే, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి చాలా కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకు తెలుసా ? ఈ స్టోరీ తెలుసుకుందాం.

వ్యాయామం చేయకపోవడం :
ప్రస్తుత ఆధునిక యుగంలో మెజార్టీ ప్రజలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల అనారోగ్యకరమైన బరువు పెరుగుతారు. రోజూ ఎక్సర్​సైజ్​లు చేయకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులంటున్నారు.

మంచి డైట్​ పాటించకపోవడం :
పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి ప్రధానం కారణం సరైన డైట్​ పాటించకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రోజువారీ అవసరాలకు మించి క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తింటారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్​ వస్తుందని నిపుణులు అంటున్నారు.

అధికంగా మద్యం సేవించడం :
మద్యంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మనం అధిక మోతాదులు ఆల్కాహాల్‌ సేవించినప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అలాగే మందు తాగుతున్నప్పుడు చాలా మంది నాన్​వెజ్​ ఎక్కువగా తింటుంటారు. ఇది కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేలా చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

స్మోకింగ్​ :
స్మోకింగ్​ (నేషనల్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ రిపోర్ట్) చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్​ వస్తుందట. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. ధూమపానం చేయడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్​ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్​ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2011లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ'​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్​ చేయని వారికంటే స్మోకింగ్​ చేసేవారికి బెల్లీ ఫ్యాట్​ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్​లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లాంగేవిటీ సైన్సెస్​కు చెందిన 'డాక్టర్​ షిమోకటా హిరోషి' పాల్గొన్నారు.

రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం :
నైట్​ కంటినిండా నిద్రపోకపోవడం వల్ల ఉదయం మనం ఎక్కువగా ఆహారం తినే అవకాశం ఉంటుందట. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి :
మన శరీరంలో పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి స్ట్రెస్​ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది దీర్ఘకాలికంగా అధిక స్థాయిలో ఉన్నప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? - ఉదయాన్నే​ ఈ డ్రింక్స్​ తాగితే వెన్నలా కరిగిపోద్ది!

బాణపొట్టతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాటర్​ తీసుకుంటే ఇట్టే కరిగిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.