Quinoa or Dalia Which is Better: ఈ మధ్య కాలంలో అనేక మంది ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వ్యాయామం, యోగా దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే బరువు అదుపులో ఉంచుకోవాలి అనుకునే వారు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు, సమతులాహారానికి ప్రాధాన్యమిచ్చే వారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారికి ఈ రెండు ఆహార పదార్థాలు చక్కటి ఆప్షన్ అని చెబుతున్నారు వైద్యులు. పైగా వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వివరిస్తున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.
క్వినోవా
మానవ శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు క్వినోవాలో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని తెలిపారు. 2010లో ప్రచురితమైన Journal of Food Science ప్రకారం.. ఇందులో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి పోషకాలూ అధికంగానే ఉంటాయని వెల్లడించారు. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). "Proximate Composition and Nutrient Content of Quinoa (Chenopodium quinoa Willd) అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో Dr. Maria Capraro Pardo పాల్గొన్నారు. ఇందులోని పోషకాలు ఎముకల ఆరోగ్యంలో, జీవక్రియల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఇంకా ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి.. శారీరక సత్తువను పెంచుకొని బరువు అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ఇన్ని ప్రయోజనాలున్న క్వినోవాను అన్నం మాదిరిగానే వండుకోవచ్చట.
గోధుమ రవ్వ (దాలియా)
అల్పాహారం అనగానే చాలా మందికి గోధుమ రవ్వ ఉప్మానే గుర్తొస్తుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో దాలియా లేదా బుల్గూర్ అని కూడా పిలుస్తుంటారు. కేవలం నిమిషాల్లో తయారయ్యే ఈ దాలియా వంటకం.. ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యాన్నీ అందిస్తుందట. ఒక కప్పు దాలియాలో సుమారు 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని వివరించారు. 2018లో Indian Journal of Medical Researchలో ప్రచుతరితమైన జర్నల్ ప్రకారం.. శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). "Nutritional and therapeutic potential of Dalia (broken wheat) - A review" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో డాక్టర్ రుచి ఓరా పాల్గొన్నారు. గోధుమ రవ్వలో కేలరీలూ తక్కువే ఉంటాయి కాబట్టి బరువు అదుపులో ఉండడానికి కూడా సహాయం చేస్తుందని చెప్పారు. ఇందులో ఉండే ఫైబర్.. జీర్ణక్రియ మెరుగదలకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సాయపడతాయని పేర్కొన్నారు. ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాలను, దెబ్బతిన్న కణాలను దృఢంగా చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరించారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.