ETV Bharat / offbeat

లంచ్​ బాక్స్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్"​ - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!

-రోటీన్​ లంచ్​ బాక్స్​లకు బాయ్​ చెప్పి ఈ రెసిపీ ట్రై చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా మెతుకు మిగలకుండా తినేస్తారు

Potato Rice
How to Make Tasty Potato Rice at Home (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Nov 8, 2024, 2:47 PM IST

How to Make Tasty Potato Rice at Home: ఉద్యోగులకైనా, స్కూల్​కి వెళ్లే పిల్లలకైనా లంచ్​ బాక్స్​ పెట్టాలంటే అమ్మలకు కొద్దిగా కష్టమైన వ్యవహారమే. ఎందుకంటే రోజూ ఒకటే రకమైనా అన్నం, కూరలు తినాలంటే బోర్​ కొడుతుంది. పెద్దలు ఏదో ఒక విధంగా తిన్నా.. పిల్లల మాత్రం తిననని మొండికేస్తారు. కొన్ని సందర్భాల్లో పెట్టిన బాక్స్​ను అలానే తిరిగి తీసుకొస్తారు కూడా. అలాగని ఏదైనా వెరైటీ చేద్దామని అనుకున్నా అది చేయడం రాకనో.. లేదంటే ఎక్కువ పదార్థాలు అవసరం అనే కారణంతో ఆ ప్రయత్నాలను విరమించుకుంటారు. మరి మీరు కూడా అలానే చేస్తున్నారా? అయితే ఇప్పుడూ ఆ అవసరం లేదు. కేవలం ఇంట్లో లభించే అతి తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా ఉండే ఆలూ రైస్​ ప్రిపేర్​ చేసుకోవచ్చు. దీని కోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. మరి ఆ పొటాటో రైస్​ను ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • బంగాళదుంపలు - 2
  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - 3
  • దంచిన యాలకులు - 2
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • సోంపు - అర టీ స్పూన్​
  • జీడిపప్పు లేదా పల్లీలు - పావు కప్పు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం తరుగు - 1 టేబుల్​ స్పూన్​
  • ఉల్లిపాయ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉడికించిన అన్నం - 1 కప్పు
  • పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • మిరియాల పొడి - అర టీ స్పూన్​(ఆప్షనల్​)

తయారీ విధానం:

  • ముందుగా బంగాళదుంపలను చెక్కు తీసి ముక్కలుగా కట్​ చేసి పక్కన ఉంచాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత ఆలు ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​ మీద క్రిస్పీగా లైట్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా కలర్​ మారిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో దాల్చిన చెక్క, లవంగాలు, దంచిన యాలకులు, మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం జీడిపప్పు లేదా పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • జీడిపప్పు లేదా పల్లీలు ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఉడికించిన అన్నం, పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, వేయించిన ఆలూ వేసి హై ఫ్లేమ్​ మీద బాగా కలుపుకోవాలి. చివరకు మిరియాల పొడి, మరికొంచెం కొత్తిమీర తరుగు వేసి టాస్​ చేసి సర్వ్​ చేసుకోవాలి.
  • అంతే ఎంతో టేస్టీగా టమ్మీకి హ్యాపీగా అనిపించే ఆలూ రైస్​ రెడీ.
  • దీన్ని వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా టేస్ట్​ అద్దిరిపోతుంది. ఆనియన్​ రైతాతో తింటే రుచి మరో లెవల్​. నచ్చితే మీరూ ట్రై చేయండి.

మీ పిల్లలు కరివేపాకు తినడం లేదా? - ఇలా రైస్​ చేసి పెడితే మెతుకు మిగల్చరు - పైగా ఆరోగ్యం కూడా!

పర్ఫెక్ట్​ లంచ్​ బాక్స్​ రెసిపీ "ఆమ్లా రైస్​" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు!

మీ పిల్లలకు అద్దిరిపోయే లంచ్ బాక్స్ - పది నిమిషాల్లోనే "గోంగూర రైస్"!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.