ETV Bharat / state

ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్​ రావును వెనక్కి తీసుకురావడం ఎలా? - అమెరికాలో గ్రీన్‌కార్డుతో పోలీసులపై ఒత్తిడి! - PHONE TAPPING CASE LATEST UPDATE

ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం - దర్యాప్తులో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పోలీసుల సమాలోచన

SIB OSD Prabhakar Rao Gets Green Card In USA
SIB OSD Prabhakar Rao Gets Green Card In USA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 2:19 PM IST

SIB OSD Prabhakar Rao Gets Green Card In USA : తెలంగాణలో సంచలనమైన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ(స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోనే స్థిరపడిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్​ స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. తాజాగా పరిణామం​ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్రమంలో ప్రభాకర్​ రావు అమెరికా వెళ్లిపోయిన సంగతి విధితమే. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్‌ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అప్పటి నుంచి ఆ దేశంలోనే ఉన్నారు. మరోవైపు పోన్​ట్యాపింగ్​ కేసు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు ఆఫీసర్స్​ను అరెస్ట్‌ చేయడంతోపాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో ఛార్జిషీట్(అభియోగపత్రం) నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు పోలీసులు మెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు.

వైద్య చికిత్స కోసమని అమెరికా వెళ్లి : వైద్యచికిత్స కోసమని అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్‌ పోలీసులకు సమాచారమందించారు. జూన్‌లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో డాక్టర్లు అనుమతిస్తే హైదరాబాద్​ నగరానికి వస్తానని పేర్కొన్నారు. అయితే గడువు దాటినప్పటికీ రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో 3నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలపాటు పొడిగించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు కూడా జారీ చేశారు.

ప్రభాకర్​ రావుకు అమెరికాలో గ్రీన్​ కార్డు : ఇంటర్‌పోల్‌ ద్వారా ప్రభాకర్​ రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్‌పోర్టును కూడా రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో ఇక్కడి పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారం.

గ్రీన్‌కార్డుదారుడు కావడంతో ప్రభాకర్‌రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన నగరానికి వచ్చే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రభాకర్​ రావు పాస్‌పోర్టు రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్​ - వెలుగులోకి ప్రభాకర్​ రావు లేఖ - PRABHAKAR RAO ON PHONE TAPPING

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో మలుపు - ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్​రావు - బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే - PRABHAKAR RAO IN PHONE TAPPING CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.