Quick And Healthy Breakfast : నేడు చాలా మంది విద్య, ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం లేదు. దీనివల్ల వారు రోజంతా నిరసంగా ఉండటం.. ఏ పని మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం, ఆసక్తి చూపించకపోవటం వంటివి మనం చూస్తుంటాం. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందంటే.. అది తప్పని సరిగా సమయానికి టిఫిన్ చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా సరే ఆరోగ్యకరమైన ఆహారం కచ్చితంగా తినాలని అంటున్నారు. అయితే.. తొందరగా రెడీ అయ్యి, హెల్దీగా ఉండే ఐదు అల్పాహారాలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1.పోహా..
తొందరగా రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లలో పోహా ముందుంటుంది. ఇది ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక కప్పు పోహాలో ఉండే పోషక విలువలు :
- 200 క్యాలరీలు
- 40 గ్రాములు కార్బోహైడ్రేట్లు
- 4 గ్రాములు ప్రోటీన్
- 1 గ్రాము కొవ్వు
- 2 గ్రాముల ఫైబర్
- వీటన్నింటితోపాటు పోహాలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి గుణాలున్నాయని అంటున్నారు.
2. ఇడ్లీ సాంబార్..
మనలో చాలా మందికి ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనేమి లేదు. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు ఇన్‌స్టంట్ ఇడ్లీ మిక్స్ ప్యాకెట్‌లను అందిస్తున్నాయి. వీటిని మనకు కావాల్సినప్పుడు కలుపుకుని ఇడ్లీలను తయారు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి వేడి వేడిగా సాంబార్‌ను యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సాంబార్ కోసం కూడా ఇన్‌స్టంట్ మిక్స్‌ను ఉపయోగిస్తే క్షణాల్లో ఇడ్లీ సాంబార్ రెడీ.
3. మసాలా ఓట్స్..
త్వరగా తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లలో మసాలా ఓట్స్ ఒకటి. దీనిని మరింత రుచికరంగా చేసుకోవడానికి బంగాళాదుంపలు, క్యారెట్లు, బఠానీల వంటి కూరగాయలను వేసుకోవచ్చు.
ఒక కప్పు (85 గ్రాములు) మసాలా ఓట్స్‌లో ఉండే పోషక విలువలు..
- క్యాలరీలు 430
- కార్బోహైడ్రేట్లు 85 గ్రాములు
- ప్రొటీన్ 14 గ్రాములు
- కొవ్వు 10 గ్రాములు
- ఫైబర్ 12 గ్రాములు
- వీటితో పాటు మసాలా ఓట్స్‌లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు వంటివి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
4.పీనట్ బట్టర్ బనానా శాండ్‌విచ్..
ఆఫీస్‌కు లేదా కాలేజీకి వెళ్లడానికి ముందుగా మీ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఎక్కువగా టైమ్ లేకపోతే ఇలా చేయండి. బ్రెడ్ స్లైస్‌ని టోస్ట్ చేసి, పైన కొంచెం పీనట్ బట్టర్ యాడ్ చేయండి. తరవాత దాని మీద కట్ చేసిన అరటి పండు స్లైసెస్‌ను పెట్టుకుని టిఫిన్ తినండి. ఇందులో మంచి ప్రొటీన్, ఫైబర్ ఉండటంతోపాటు సులభంగా జీర్ణమవుతుంది.
5.స్మూతీ (Smoothie)..
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అనిపించకపోతే ఈ డ్రింక్‌ను ట్రై చేయండి. ముందుగా కొన్ని రకాల పండ్ల ముక్కలను తీసుకుని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేయండి. ఆ తరవాత అందులోకి కొద్దిగా పెరుగు లేదా పాలను యాడ్ చేసుకోండి. మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసి.. ప్రొటీన్ పౌడర్‌ను లేదా పీనట్ బట్టర్‌ను అడ్ చేసుకుని తాగండి. ఎంతో టేస్ట్‌గా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
ఫ్రిజ్‌లో బంగాళదుంపలు పెడితే యమా డేంజర్!- మరో 12 ఫుడ్ ఐటమ్స్తోనూ ఇబ్బందే
బీ అలర్ట్ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్ వచ్చే అవకాశం!