ETV Bharat / health

సొరియాసిస్​ రావడానికి కారణం తెలిసిపోయింది! ఇక భయపడాల్సిన అవసరం లేదు!!

-సొరియాసిస్​ను ప్రేరేరిపిస్తున్న హెప్సిడిన్‌ హార్మోన్‌ -తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Psoriasis Skin Disease Causes
Psoriasis Skin Disease Causes (ETV Bharat)

Psoriasis Skin Disease Causes: మనకు ఎక్కువగా కనిపించే చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ఒకటి. ఎర్రటి మచ్చలు, తెల్లటి పొలుసులతో దీర్ఘకాలం వేధించే ఈ సమస్య వల్ల చర్మంపైన చేపల పొలుసులాంటి వాపుతో పాటు దురద, నొప్పి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దీనికి గల కారణాలపైన అనేక అధ్యయనాలు చేసిన పరశోధకులు తాజాగా ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. Nature Communications జర్నల్​లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం సొరియాసిస్​ను హెప్సిడిన్‌ అనే హార్మోన్‌ ప్రేరేపిస్తున్నట్టు తేలింది. "Skin hepcidin initiates psoriasiform skin inflammation via Fe-driven hyperproliferation and neutrophil recruitment" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో డాక్టర్లు Eliane Abboud, Diana Chrayteh పాల్గొన్నారు. అందువల్ల హెప్సిడిన్‌ను సొరియాసిస్‌కు బలమైన కారకంగా నిపుణులు పరిగణిస్తున్నారు.

అయితే, సాధారణంగా ఈ హార్మోన్‌ క్షీరదాల్లో ఐరన్‌ మోతాదులను పర్యవేక్షిస్తుంటుంది. ఆహారం నుంచి ఐరన్‌ను ఎంత మోతాదులో గ్రహించుకోవాలి? తర్వాత దాన్ని శరీరంలోకి ఎంత విడుదల చేయాలనే విషయాన్ని ఇది నియంత్రిస్తుంది. మనకు చాలా కీలకమైన ఐరన్‌.. ఒంట్లో రక్తం ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేయటంతో పాటు చర్మ ఆరోగ్యానికీ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గాయాలను మాన్పటం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, కొలాజెన్‌ ఉత్పత్తి వంటి ముఖ్యమైన ప్రక్రియల్లోనూ పాలు పంచుకుంటుందని వివరించారు.

కానీ చర్మంలో ఐరన్‌ మోతాదులు పెరిగితే మాత్రం హానికరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది అతి నీలలోహిత సూర్యకాంతి దుష్ప్రభావాలను పెంచుతుందని తెలిపారు. ఫలితంగా కణాలు విపరీతంగా వృద్ధి చెందే సొరియాసిస్‌ వంటి దీర్ఘకాల సమస్యలకూ దారితీస్తుందని చెబుతున్నారు. సొరియాసిస్‌ బాధితుల చర్మ కణాల్లో ఐరన్‌ ఎక్కువ మొత్తంలో ఉంటున్నట్టు చాలాకాలం క్రితమే పరిశోధనల్లో బయటపడింది. కానీ దీనికి కారణమేంటి? సొరియాసిస్‌కూ దీనికీ ఉన్న సంబంధమేంటి? అన్న విషయాలు తెలియరాలేదు. అయితే, తాజాగా చేసిన అధ్యయనాల్లో ఇందుకు హెప్సిడిన్‌ హార్మోన్‌ కారణం కావొచ్చని తేలింది. ఆరోగ్యవంతుల్లో ఇది కాలేయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. సొరియాసిస్‌ బాధితుల్లో చర్మంలోనూ పుట్టుకొస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

జీవితాన్నే మార్చివేసే సొరియాసిస్‌.. బారినపడ్డ వారు శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పడుతుంటారు. ఇది ఇతరత్రా తీవ్ర సమస్యలకూ దారితీస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చర్మంలో హెప్సిడిన్‌ హార్మోన్‌ మోతాదులను సరిచేయగల కొత్త చికిత్సలతో ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చర్మంతో పాటు గోళ్లు, కీళ్లనూ ప్రభావితం చేసే తీవ్రమైన, మందులకు సైతం లొంగని పశ్చులర్‌ సొరియాసిస్‌తో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బిగ్ అలర్ట్ : పొగ తాగనివారిలోనూ "ఊపిరితిత్తుల క్యాన్సర్" - తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు!

HCU on psoriasis: సోరియాసిస్‌ నియంత్రణకు ఔషధాలు.. హెచ్​సీయూ ఆచార్యుల విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.