ETV Bharat / health

అలర్ట్ : కండలు పెంచేందుకు ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? - ఏం జరుగుతుందో మీకు తెలుసా? - Protein Powder Side Effects

Protein Powder Side Effects : బాడీ బీల్డింగ్​ అంటే నేటి యువతకు తెగ మోజు. అందుకే.. కండలు తిరిగిన దేహం కోసం జిమ్​లో శ్రమిస్తుంటారు. అయితే.. సిక్స్ ప్యాక్ వంటి బాడీ కావాలంటే.. చాలా టైమ్ పడుతుంది. అంతకాలం వెయిట్ చేసే ఓపిక లేనివారు ఇన్​ స్టంట్​ కండల కోసం ట్రై చేస్తున్నారు. దీనికోసం ప్రొటీన్ పౌడర్ తింటూ ఉంటారు. మరి.. దీనివల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 12:11 PM IST

Side Effects Of  Protein Powder
Protein Powder Side Effects (ETV Bharat)

Side Effects Of Protein Powder : ఆరు పలకల దేహం.. కండలు తిరిగిన బాడీ కోసం ప్రొటీన్ పౌడర్ వాడేవారందరూ అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఈ ప్రొటీన్ పౌడర్ అధికంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పోషకాహార లోపం : ప్రొటీన్ పొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో పోషకాల అసమతుల్యత ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పొడిలో ఎక్కువ మొత్తంలో ప్రొటీన్(Protein) మాత్రమే లభిస్తుంది. దాంతో మిగతా పోషకాలు సరిగ్గా అందక బ్యాలెన్సింగ్ సమస్య తలెత్తవచ్చంటున్నారు.

కీడ్నీల మీద ప్రభావం : అధికమొత్తంలో ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చంటున్నారు. ప్రొటీన్‌ జీర్ణమయ్యాక మిగిలిపోయే అమ్మోనియా బయటకు వెళ్లిపోవాల్సిందే. ఇది చాలా వరకూ యూరిన్ ద్వారానే పోతుంది. దీంతో కిడ్నీల మీద ఎక్కువ భారం పడి వాటి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.

జీర్ణ సమస్యలు : ప్రొటీన్‌ పొడులతో కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. బటానీ ప్రొటీన్‌ తీసుకున్నవారికి కడుపుబ్బరం వంటి ప్రాబ్లమ్స్ రావొచ్చట. అలాగే.. పాలలో ఉండే లాక్టోజ్‌ అనే చక్కెర పడనివారికి కడుపునొప్పి, విరేచనాల వంటి వాటికి దారితీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

విషతుల్యాలతో ప్రమాదం : కొన్ని ప్రొటీన్ పొడుల్లో విషతుల్యాలు, పురుగుమందుల అవశేషాలూ ఉండే అవకాశం ఉందట. ఫలితంగా.. వీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి, అలసట, మలబద్ధకంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.

కాలేయానికి నష్టం : ప్రొటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకోవడం కాలేయం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని పొడుల్లో ఉండే డెక్స్ట్రోజ్ అనే ఒక రకమైన చక్కెర పదార్థం ఇందుకు కారణం కావొచ్చంటున్నారు.

2017లో "ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డెక్స్ట్రోజ్ ఉండే ప్రొటీన్ పౌడర్లను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయ కణాలకు నష్టం కలిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఆస్టిన్​లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం న్యూట్రిషన్ సైన్స్ విభాగంలో డాక్టర్ జేన్ డో పాల్గొన్నారు. ప్రొటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకోవడం లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇన్సులిన్ స్థాయి పెరగొచ్చు : కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఇన్సులిన్ స్థాయి పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. కొన్ని పొడుల్లో చక్కెర కూడా కలిసి ఉండొచ్చు. పిండి పదార్థమూ ఉండొచ్చు. చక్కెర అదనంగా కలపకపోయినా ఈ పిండి పదార్థంలోనూ సహజంగా చక్కెర ఉంటుంది. అందువల్ల మధుమేహం(Diabetes), అధిక బరువు గలవారు ప్రొటీన్ పౌడర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి.. వీలైనంతవరకూ ఆహారం ద్వారా తగినంత ప్రొటీన్‌ లభించేలా చూసుకోవటం బెటర్ అని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

మొక్కల ప్రొటీన్​ Vs జంతు ప్రొటీన్​ - ఆరోగ్యానికి ఏది మంచిది?

ఎగ్స్​లోనే కాదు- అంతకుమించిన ప్రొటీన్స్ ఈ కూరగాయల్లో​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.