Problems Not Sleeping Till Midnight : ఈ రోజుల్లో చాలా మంది అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటున్నారు. కొందరు ఉద్యోగరిత్యా ఈ పరిస్థితిలో ఉంటుంటే.. మరికొందరు ఎలాంటి పని లేకున్నా కేవలం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతూ నిద్ర పోవట్లేదు. మిడ్‌నైట్ వరకు సోషల్ మీడియాలో విహరిస్తున్నారు. ఫోన్‌కాల్స్, చాటింగ్‌లతో కాలం గడుపుతున్నారు. అయితే.. ఇలా మిడ్‌నైట్ వరకు మెలకువగా ఉండటం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. మరి.. నిద్రలేమితో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిడ్‌నైట్ వరకు నిద్రపోకుండా ఉంటే జరిగేది ఇదే ?
బయాలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది..
అర్ధరాత్రి వరకు నిద్రపోక పోవడం వల్ల మన శరీరంలోని బయాలాజికల్ సైకిల్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హార్మోన్ల విడుదల సక్రమంగా జరగదని చెబుతున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు.
జీర్ణక్రియపై ప్రభావం..
మిడ్‌నైట్ వరకు మెలకువగా ఉండేవారిలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి వారు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది..
దీర్ఘకాలికంగా అర్ధరాత్రి వరకు నిద్రకు దూరంగా ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చేసే పనిపై శ్రద్ధ, ఆసక్తి కనబరచరని అంటున్నారు. అలాగే మనిషిలో చురుకుదనం తగ్గుతుందని తెలియజేస్తున్నారు.
బరువు పెరుగుతారు..
నిద్రలేమి సమస్య వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అలాగే అనారోగ్యకరమైన బరువు పెరుగుతారట.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది..
మిడ్‌నైట్ వరకు నిద్రపోని వారిలో రోజురోజుకు రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారు అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్, హెపర్‌టెన్షన్ స్థాయులు పెరుగుతాయి.
ఈ సమస్యను ఎలా అధిగమించాలి ?
- మిడ్‌నైట్ వరకు నిద్రపోని వారు వెంటనే వారి జీవనశైలిని మార్చుకోవాలి.
- ఇందులో భాగంగా నైట్ పడుకునే రెండు గంటల ముందే ఆహారాన్ని తినాలి.
- నిద్రపోయే గంట ముందు ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి.
- నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకోవాలి.
- నైట్ సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దిగా తీసుకోవాలి.
- పడుకునే గది ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి.
- తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వినికిడి లోపమా? మీరు చేసే ఈ తప్పులే కారణమట!
బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తింటున్నారా? - గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గ్యారెంటీ!