Prevent Brain Stroke With Lifestyle Changes : బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళాలు మూసుకోయి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాణాంతక పరిస్థితినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది రావడానికి ముందు ముఖం ఒకవైపు, ఒక చేయి తిమ్మరిగా, లాగినట్టుగా అనిపించడం, మాటలో స్పష్టత కోల్పోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం,దృష్టి సమస్యలు లాంటి లక్షణాలను కనిపిస్తాయి. వీటిని మొదటి దశలోనే గుర్తించి వైద్యుని సంప్రదిస్తే సమస్య ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. అలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ముందుగానే తప్పించుకోవాలంటే మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో చూద్దాం
1. రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటుతో బాధపడే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు ఆహారంలో ఉప్పు తగ్గించి తినాలి. అలాగే అధిక కొవ్వు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండి రక్తపోటును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
2.వ్యాయామాం
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా చురుగ్గా ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలి. ఇందుకోసం బ్రెయిన్‌కు రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడే యోగాసనాలు, వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.
3.బరువు నియంత్రణ
అధిక రక్తపోటుతో పాటు ఊబకాయం సమస్య కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. బరువును నియంత్రించుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
4.ధూమపానం
ధూమపానం రక్తాన్ని చిక్కగా చేసి ధమనుల్లో అడ్డంకులకు కారణమవుతుంది. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ముందుగా పొగ త్రాడగం మానేయాలి.
5.నిద్ర
నిద్ర విధానాల్లో మార్పులు, సరిపడా నిద్ర లేకపోవడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎన్ని పనులున్నా మీ నిద్ర కోసం మీరు కచ్చితంగా 7 నుంచి 8 గంటలు తప్పకుండా కేటాయించండి.
వీటితో పాటు మీ మెదడును చురుగ్గా మార్చేందుకు పజిల్ గేమ్స్, గజిబిజి పదాలు, కొత్త కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి చేస్తుండాలి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.