ETV Bharat / health

అద్భుతం : ప్లేట్​లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు ఈ '5' పండ్లు తింటే - జెట్​ స్పీడ్​లో పెరుగుతాయట! - Fruits To Increase Platelet Count

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 5:01 PM IST

Platelets Count Increase Fruits : డెంగీ.. ఈ జ్వరం పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు జనాలు. అందుకు ముఖ్య కారణం ప్లేట్​లెట్స్ కౌంట్ వేగంగా తగ్గిపోవడమే. అయితే అలాంటి టైమ్​లో ఈ 5 రకాలలో పండ్లలో ఏది తిన్నా వేగంగా ప్లేట్​లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

These Fruits To Increase Platelets Count
Best Fruits To Increase Platelets Count (ETV Bharat)

Best Fruits To Increase Platelets Count : వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల సీజనల్ వ్యాధులు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా ఫ్లూ, డెంగీ, టైఫాయిడ్, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. డెంగీ. ఈ పేరు చెబితేనే హడలెత్తిపోతారు ప్రజలు. అందుకు ప్రధాన కారణం.. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడమే. కేవలం ఈ ఒక్క జ్వరం అనే కాదు.. మలేరియా వచ్చినా ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకినా ఈ రక్తకణాల సంఖ్య ఒక్కసారిగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. అందుకే అలాంటి టైమ్​లో తగిన మందులు వాడుతూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆ టైమ్​లో ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే నేచురల్​గా ప్లేట్​లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బొప్పాయి : ఈ పండులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. దీని ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే.. బొప్పాయి(Papaya) పండుతో పాటు ఆకులను తీసుకున్న మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పుడు రోజూ కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలు తిన్నా లేదా ఖాళీకడుపున లేత బొప్పాయి ఆకుల రసం తాగినా ప్లేట్​లెట్స్​ కౌంట్​లో గణనీయమైన మార్పు కనిపిస్తుందంటున్నారు నిపుణులు

2019లో "Frontiers in Pediatrics" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డెంగ్యూ జ్వరం వల్ల తక్కువ ప్లేట్‌లెట్‌ల సంఖ్య ఉన్న పిల్లలకు బొప్పాయి లేత ఆకుల రసం ఇవ్వడం వల్ల ప్లేట్‌లెట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్​కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ డేవిడ్ టాన్ పాల్గొన్నారు. బొప్పాయిలోని ఔషధ గుణాలు ప్లేట్​లెట్స్ సంఖ్యను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

దానిమ్మ : ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు ఐరన్‌, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్​లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. రోజూ ఓ గ్లాసు దానిమ్మ రసాన్ని కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తాగితే రక్తకణాల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు.

కివీ : దీనిలో ప్రొటీన్‌, కాల్షియం, పొటాషియంతోపాటు సి, కె, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రక్తహీనత, బి-విటమిన్‌ లోపంతోనూ వైరల్‌ ఇన్ఫెక్షన్లతోనూ బాధపడేవాళ్లు రోజుకి రెండు కివీ(Kiwi) పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే డెంగీ జ్వరం వచ్చినప్పుడు ఈ పండు తినడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండా కాపాడుకోవచ్చంటున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ : ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, లైకోపీన్‌ పీచూ ఐరన్‌ శాతం అధికంగా ఉంటాయి. కాబట్టి, డ్రాగన్‌ పండు డెంగీ వ్యాధి తీవ్రతని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎరుపురంగు డ్రాగన్‌ తొక్కతో చేసిన పెరుగు తినడం వల్ల హీమోగ్లోబిన్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగినట్లు ఎలుకలపై చేసిన పరిశీలనలోనూ తేలిందట.

జామ : అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి.. జామ. దీనిలో విటమిన్ సి, ఐరన్​తో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్​ను పెంచడమే కాకుండా ఎర్ర రక్తకణాల నిర్మాణానికి తోడ్పడతాయంటున్నారు. కాబట్టి డెంగీ సోకినప్పుడు జామ పండు తినడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

రీసెర్చ్ : బెంబేలెత్తిస్తున్న డెంగీ, మలేరియా - ఈ కలర్ డ్రెస్సు వేసుకున్న వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయ్!

మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.