ETV Bharat / health

అసలు పైల్స్​ ఎందుకొస్తాయి? - రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - Piles Symptoms and How to Cure - PILES SYMPTOMS AND HOW TO CURE

Piles Symptoms: పైల్స్​.. ఈ సమస్య ఉన్నవాళ్లు పడే బాధ అంతా ఇంతా కాదు. అటు కూర్చోలేరు.. ఇటు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Piles Symptoms
Piles Symptoms and How to Cure (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 4:41 PM IST

Updated : May 16, 2024, 9:39 AM IST

Piles Symptoms and How to Cure : పైల్స్.. తెలుగులో మొలలు అంటారు. వీటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. బాధితుడికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్​ ఉన్నవారు ఎక్కువ దూరం నడవలేరు, కూర్చోలేరు. నానా అవస్థలు పడుతుంటారు. మరి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పైల్స్​ అంటే ఏమిటి?: మలద్వారం వద్ద ఏనల్ కుషన్స్ ఉంటాయి. మలం గట్టిగా, రాయిలా వచ్చినప్పుడు ఆ ఏనల్ కుషన్స్ కిందకు జారతాయి. దీనినే పైల్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. అవి.. అంతర్గత మొలలు, బాహ్య మొలలు.

అంతర్గత మొలలు: అంతర్గత పైల్స్ బయటకు కనిపించవు. అవి పురీషనాళం లోపలి గోడల వెంట ఉంటాయి. అక్కడ ఎక్కువ నరాలు ఉండవు కాబట్టి పెద్దగా నొప్పి ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ అంతర్గత మొలలను మలవిసర్జన సమయంలో, శుభ్రం చేసుకునేటప్పుడు గుర్తించవచ్చు. అయితే ఇవి వాటంతట అవే లోపలకు వెళ్లి యథాస్థానానికి చేరిపోతాయి.

బాహ్య పైల్స్: ఇవి పాయువు చుట్టూ, చర్మం కింద భాగంలోనే ఉంటాయని.. అక్కడ నరాలు ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి బాగా ఉంటుందని అంటున్నారు. రక్తస్రావం, దురద, నొప్పి, వాపు.. వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. రక్తం గడ్డకట్టి నీలం రంగులోకి మారుతుంది. గడ్డకట్టిన రక్తం కరిగినప్పుడు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పైల్స్​ రావడానికి కారణాలు:

  • మానసిక ఒత్తిడి, మద్యపానం వల్ల కూడా మొలలు వస్తాయి.
  • ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల పైల్స్​ వస్తాయి.
  • వయసు పైబడిన వారిలో, టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చున్న కూడా ఇవి వస్తాయి.
  • గట్టిగా నిరంతరంగా దగ్గేవారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
  • అధిక బరువు పొట్టపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది పురీషనాళంలోని రక్త నాళాలపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ కారణంగా కూడా మొలలు వచ్చే అవకాశం.
  • మహిళలకు గర్భధారణ సమయంలో కూడా మొలలు వస్తాయి. అయితే ఇవి డెలివరీ తర్వాత తగ్గిపోతాయి.

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea

చికిత్స ఎలా: ఏనల్ కుషన్స్ ఎంత దూరం జారాయి అనే దాన్ని బట్టి పైల్స్ తీవ్రతను గ్రేడ్​-1, గ్రేడ్-2, గ్రేడ్​-3, గ్రేడ్-4గా పరిగణిస్తారు. చాలా వరకు గ్రేడ్​-1, గ్రేడ్​-2 ఉంటాయి. వాటిని మందులు, ఆహార మార్పులు ద్వారా తగ్గించడానికి ఆస్కారముంటుందని అంటున్నారు. గ్రేడ్-3, గ్రేడ్-4 విషయంలో మాత్రం అలా కాదని.. అలాంటి కేసుల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఒక్కోసారి గ్రేడ్​-1, గ్రేడ్​-2 కేసుల్లోనూ రక్తస్రావం ఎక్కువగా ఉంటే మందులతోపాటు ఆపరేషన్​ కూడా అవసరం అవుతుందని సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: Precautions To Cure Piles: రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సులువుగా ఎదుర్కోవచ్చని నిపుణులు అంటున్నారు. నీట్​గా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు తీసుకుంటే వారం రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా కారం, మసాలా, పచ్చళ్లు, ఊరగాయలు, వేపుళ్లు, దుంప కూరలు, కెఫెన్​కు దూరంగా ఉండాలని అంటున్నారు.

2016లో జర్నల్ ఆఫ్ డిజెస్టివ్ డిసీజెస్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఫైబర్​ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల పైల్స్​ వచ్చే అవకాశం తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బీజింగ్​లోని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోషకాహార నిపుణుడు డాక్టర్ జియాన్‌హువా జాంగ్ పాల్గొన్నారు. ప్రతిరోజూ 25 గ్రాముల ఫైబర్ తీసుకునే వారికి పైల్స్​ సమస్య వచ్చే అవకాశం 30% తక్కువని ఆయన పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా నైట్‌ నిద్రపట్టడం లేదా ? అయితే మీరు ఈ లోపంతో బాధపడుతున్నట్లే! - Magnesium Foods Sources

నెలరోజుల పాటు డైలీ నట్స్​ తింటే - మీ శరీరంలో జరిగే మార్పులివే! - Benefits of Eating Nuts Daily

Last Updated : May 16, 2024, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.