Obesity Health Problems In Women : ప్రస్తుత కాలంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే.. ఆహారపు అలవాట్లతోపాటు అధిక బరువు కూడా ఎన్నో ప్రమాదకర వ్యాధులకు ప్రధాన కారణంగా నిలుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో క్యాన్సర్ కూడా ఉందని చెబుతున్నారు.
అండాశయ క్యాన్సర్..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక బరువు వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చే.. అండాశయ క్యాన్సర్‌కు బరువే కారణమని చెబుతున్నారు. 2019లో "జామా ఆంకాలజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. అధిక బరువుతో బాధపడుతున్న మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, సాధారణ బరువు కలిగిన మహిళలతో పోలిస్తే వీరిలో 24 శాతం ఎక్కువని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ప్రొఫెసర్ 'డాక్టర్ డానా' పాల్గొన్నారు. అధిక బరువున్న మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బరువు పెరగడానికి కారణాలు :
కొంతమంది మహిళలు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటివాటిని అధికంగా తీసుకుంటారు. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. అలాగే శరీరక శ్రమకు దూరంగా ఉండటం వల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా బరువు పెరగడానికి వివిధ కారణాలున్నాయి. మంచి జీవనశైలి, ఆహారంలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గొచ్చని అంటున్నారు. దీనివల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
అద్భుతం: ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే - మీ ఒంట్లోని కొవ్వు మంచులా కరిగిపోద్ది!
ఇలా చేయండి :
ఆహారం : ప్రొటీన్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే తృణధాన్యాలను డైట్‌లో ఎక్కువగా తీసుకోండి.
వ్యాయామం : ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. శక్తిని ఖర్చు చేసే ఏరోబిక్ వ్యాయామాలు.. నడక, పరుగు, తాడాట, ఈత, సైకిల్ తొక్కటం వంటివేవైనా చేయాలి.
ధ్యానం, ప్రాణాయామం: ఒత్తిడి తగ్గటానికి రోజూ యోగా, ధ్యానం చేయాలి. వీటివల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇవి డైలీ చేయడం వల్ల బరువు తగ్గటానికి బాగా తోడ్పడతాయి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వయసు మీద పడటం, ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు - "నడుము నొప్పి"కి ఇవీ కారణాలే!
అలర్ట్ : మీ అందాన్ని పాడుచేసే మొటిమలకు - మీ దిండు కారణమని తెలుసా?