ETV Bharat / health

బిగ్ అలర్ట్ : నాన్​స్టిక్ పాత్రలు వాడితే ఏమవుతుందో తెలుసా? - ఐసీఎంఆర్ హెచ్చరికలు! - Nonstick Cookware Side Effects - NONSTICK COOKWARE SIDE EFFECTS

Nonstick Cookware Side Effects : నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేయడం చాలా ఈజీ.. క్లీన్ చేయడం డెడ్ ఈజీ.. అందుకే దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఇవి కనిపిస్తాయి. అయితే.. వీటిని వాడేవారందరికీ బిగ్ అలర్ట్. నాన్​ స్టిక్ వాడకంపై ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీచేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Nonstick Cookware Side Effects
Nonstick Cookware (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 9:25 AM IST

ICMR Warning Against Nonstick Cookware Usage : నేటి రోజుల్లో చాలా మంది వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా, సులభంగా వంట పని పూర్తిచేసుకోవచ్చని నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే.. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని, నూనె ఉపయోగం తగ్గుతుందని.. ఇలా రకరకాల కారణాలతో నాన్‌స్టిక్‌ కుక్​వేర్(Nonstick Cookware Usage)​ వాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు కూడా వంట చేయడానికి నాన్​స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే, మీకో బిగ్ అలర్ట్.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR) అలాంటి పాత్రలను ఇకపై వాడొద్దని సూచిస్తోంది. వీటి వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అంతేకాదు.. ఎలాంటి పాత్రలు వాడితే ఆరోగ్యానికి మంచిదో కూడా పలు సూచనలు చేసింది. అసలు, నాన్​స్టిక్ పాత్రలు ఎందుకు ప్రమాదకరం? వాటికి బదులుగా వేటిని యూజ్ చేస్తే మంచిది? ఐసీఎంఆర్ ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనం యూజ్ చేసే నాన్​స్టిక్ పాత్రలను 'పాలీ టెట్రాఫ్లోరో ఎథిలిన్'(PTFE) అనే పదార్థంతో తయారుచేస్తారు. ఈ పదార్థాన్నే టెఫ్లాన్ అని కూడా పిలుస్తారు. కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో టెఫ్లాన్ అనే సింథటిక్ రసాయన పదార్థం తయారవుతుంది. దీన్ని అడుగు భాగాన పోతగా పోసి నాన్​స్టిక్ పాత్రలను రూపొందిస్తారంటున్నారు నిపుణులు. ఆ విధంగా తయారుచేసిన నాన్​స్టిక్ కుక్​వేర్​పై.. ఏ చిన్న గీత పడినా టెఫ్లాన్ కోటింగ్ నుంచి విష వాయువులు, హానికారక కెమికల్స్ వెలువడి మనం తినే ఆహారంలో కలుస్తాయని చెబుతుంది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రీసెర్చ్‌. కనీసం ఒక్క గీత నుంచి 9,100 మైక్రోప్లాస్టిక్‌ రేణువులు రిలీజ్ అవుతాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

నాన్​ స్టిక్​ పాత్రల్లో ఇవి వండకూడదు! - వండితే ఏమవుతుందో తెలుసా?

ఇక గీతలు పడిన ఆ నాన్​స్టిక్ పాత్రలను ఉపయోగించి.. సాధారణ టెంపరేచర్ వద్ద కాకుండా 170 డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని సూచిస్తోంది ఐసీఎంఆర్. ఈ పాత్రలను క్లీన్ చేసేటప్పుడు వాటిపై బోలెడన్ని గీతలు పడడం మనం చూస్తుంటాం. ఈ లెక్కన చూస్తే వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్‌ రిలీజ్ అవ్వొచ్చు. మనకు తెలియకుండానే అవి తినే ఆహారంలో కలిసి శరీరంలోని చేరవచ్చు. ఫలితంగా నాన్​స్టిక్ పాత్రలను యూజ్ చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.

ఈ ఆరోగ్య సమస్యలు రావొచ్చు : నాన్​స్టిక్ పాత్రలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్, సంతానోత్పత్తి, శరీర నొప్పులు, హార్మోన్లలో అసమతుల్యత, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

వాటికి బదులుగా వీటిని యూజ్ చేయండి : నాన్‌స్టిక్ కుక్‌వేర్​కు బదులుగా మట్టిపాత్రల్లో వంట చేసుకోవడం అత్యంత సురక్షితమని ఐసీఎంఆర్ పేర్కొంది. అలాగే.. ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్‌లెస్ స్టీల్‌ పాత్రలలో వంట చేసుకున్నా మంచిదేనని సూచించింది. అదేవిధంగా.. ఎటువంటి రసాయన పూతలు లేని గ్రానైట్ పాత్రలు కూడా నాన్​స్టిక్ పాత్రలకు ప్రత్యామ్నాయంగా పేర్కొంది. 'భారతీయులకు ఆహార మార్గదర్శకాలు' అనే పేరుతో ఇటీవలే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఈ సూచనలను రిలీజ్ చేసింది.

ఐరన్‌ పాత్రల జిడ్డు ఓ పట్టాన వదలట్లేదా? - ఇలా క్లీన్‌ చేస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.