ETV Bharat / health

అలర్ట్ : తిన్న వెంటనే ఈ పనులు చేస్తున్నారా? - అయితే ముప్పు తప్పదు! - Dont Do These Things After Meals - DONT DO THESE THINGS AFTER MEALS

Dont Do These Things After Meals : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అంతేకాదు.. తిన్నాక కొన్ని పనులు చేయొద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు. మరి, భోజనం తర్వాత చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం.

Avoid These Habits After Meals
Dont Do These Things After Meals (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 4:39 PM IST

Avoid These Habits After Meals : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడంతోపాటు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. నిత్య జీవితంలో మనం చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్లే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు. ముఖ్యంగా భోజనం(Meals) తర్వాత తెలిసో, తెలియకో చేసే ఈ పనులు జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా.. కొంతమందిలో లేనిపోని ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. ఇంతకీ.. తిన్న వెంటనే చేయకూడని ఆ పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్నానం చేయొద్దు : కొంతమందికి తిన్నాక స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఈ హ్యాబిట్ మానుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టకు సరైన మొత్తంలో రక్త ప్రసరణ, శక్తి అవసరం. అదే.. మీరు భోజనం తర్వాత స్నానం చేస్తే రక్త ప్రసరణ చర్మం వైపు వెళ్లి టెంపరేచర్​ను నియంత్రిస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ కావాల్సి వస్తుంది. దాంతో అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి.. తిన్నాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే బాత్ చేయడం బెటర్ అంటున్నారు.

వాటర్ ఎక్కువగా తాగొద్దు : చాలా మంది తిన్న వెంటనే గడగడా వాటర్ తాగేస్తుంటారు. కానీ, అలా తాగడం జీర్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. మీరు తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగితే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్‌, జీర్ణ రసాలు.. వంటివి పొట్టలో తక్కువగా రిలీజ్ అవుతాయట! ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే కాకుండా శరీరంలో టాక్సిన్లు విపరీతంగా పెరుగుతాయంటున్నారు. అందుకే తిన్న గంట తర్వాత నీటిని తాగితే మంచిదని చెబుతున్నారు.

వీటికి దూరంగా ఉండాలి : మీకు తిన్న వెంటనే టీ లేదా కాఫీ(Coffee) తాగే అలవాటు ఉందా? అయితే, ఈ అలవాటును మానుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. తిన్నాక కాఫీ, టీ తాగితే వాటిలో ఉండే టానిన్లు, కొన్ని రకాల ఆమ్లాలు ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. ఫలితంగా జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని చెబుతున్నారు! 2000లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు కాఫీ తాగిన వ్యక్తులలో ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్​లో ఇటలీకి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ M.మారాగో పాల్గొన్నారు.

పండ్లు తింటున్నారా? పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, తిన్న వెంటనే పండ్లను తినకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని పోషకాలు బాడీకి అందవన్నది నిపుణుల అభిప్రాయం! అందుకే.. తిన్న తర్వాత వెంటనే పండ్లు తినకపోవడమే మంచిదట.

వీటితోపాటు తిన్న వెంటనే నిద్ర పోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరుగుతారంటున్నారు. అంతేకాదు.. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందట. కాబట్టి.. భోజనం తర్వాత ఈ పనులకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

అలర్ట్​: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా ? అయితే మీకు ఈ ప్రాబ్లమ్​ ఉన్నట్టే!

తిన్న వెంటనే కడుపులో మంటగా ఉంటోందా? కారణాలు ఇవే అంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.