ETV Bharat / health

సూపర్​ ఐడియా: పొట్టపై స్ట్రెచ్‌మార్క్స్ కనిపించకుండా చేయడం ఇంత ఈజీనా! మీరు ట్రై చేస్తారా? - Remedies to Reduce Stretch Marks

Tips For Remove Stretch Marks : చాలా మంది మహిళల్లో డెలివరీ తర్వాత పొట్ట చుట్టూ చారలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లు, లోషన్‌లను వాడుతుంటారు. అయితే ఇవేమి అవసరం లేకుండా.. ఇంట్లో లభించే వస్తువులతోనే పరిష్కారం లభిస్తుందని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 3:11 PM IST

Stretch Marks
Tips For Remove Stretch Marks (ETV Bharat)

Natural Remedies to Reduce Stretch Marks : ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది మహిళలు స్ట్రెచ్‌మార్క్స్​తో ఆందోళన చెందుతుంటారు. అలాగని కేవలం డెలివరీ అయిన వాళ్లకే ఈ సమస్య ఎదురవుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి. ఒక్కోసారి వీటి వల్ల నచ్చినట్లు డ్రస్సింగ్ కూడా చేసుకోలేం. అందుకే ఎక్కువ మంది స్ట్రెచ్‌మార్క్స్‌ని మాయం చేసుకోవడానికి మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లు, లోషన్‌లను వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల సమస్య తగ్గడం ఏమో కానీ.. ఇందులో ఉండే రసాయనాల వల్ల చర్మానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకి ఇంట్లో లభించే వస్తువులతోనే పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. అవేంటంటే..

బంగాళాదుంప: స్ట్రెచ్​మార్క్స్​ని తగ్గించడంలో బంగాళాదుంప ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ముందుగా ఒక పెద్ద బంగాళాదుంపని తీసుకుని పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అందులో ఒక ముక్క తీసుకుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట 10 నిమిషాల పాటు మసాజ్‌ చేయండి. ఒక పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల బంగాళాదుంప రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మకణాల ఉత్పత్తిని పెంచి.. స్ట్రెచ్‌మార్క్స్‌ని తగ్గించడానికి సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మాయిశ్చరైజర్​: డైలీ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల బరువు పెరిగినా లేదా తగ్గినా చారలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడ్డా.. ఆ ప్రదేశంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.

మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి!

కలబంద గుజ్జు, కొబ్బరి నూనె : మహిళల సౌందర్యాన్ని కాపాడటానికి ఎన్నో రకాలుగా కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. అయితే, స్ట్రెచ్‌మార్క్స్ తొలగించుకోవడానికి కూడా కలబంద ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకోసం కొద్దిగా కలబంద గుజ్జు, కొబ్బరినూనె కలిపి రోజూ పొట్టపై అప్లై చేసుకుంటే.. త్వరగా అవి మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

2018లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యాయనం ప్రకారం.. స్ట్రెచ్‌మార్క్స్‌పై అలోవెరా జెల్, కొబ్బరి నూనెను కలిపి అప్లై చేసుకోవడం వల్ల.. స్ట్రెచ్‌మార్క్స్‌ తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్లాజిజ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజీస్ట్‌ 'డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్లా' పాల్గొన్నారు.

నూనెతో మసాజ్‌: ఇంట్లో మనకు సహజ సిద్ధంగా అందుబాటులో ఉండే ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని డైలీ పది నిమిషాల పాటు స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట మర్దన చేసుకోవాలి. దీనివల్ల సాగిన చర్మం తిరిగి యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. అలాగే క్రమంగా స్ట్రెచ్‌మార్క్స్‌ కూడా కనిపించకుండా పోతాయని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పాపం ముఖం మీది ఈ మచ్చలు బాధిస్తున్నాయా? - ఈ నేచురల్ టిప్స్​తో ముఖం మిలమిలా మెరిసిపోద్ది!

ముక్కు, ముఖం మీద ఈ సమస్య వేధిస్తోందా? - ఇలా చేస్తే చిటికెలో క్లియర్​ చేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.