ETV Bharat / health

వాస్తు ప్రకారం మీ ఇంటిని ఇలా క్లీన్ చేయండి - దోషాలన్నీ తొలగిపోతాయ్! - Vastu Tips For Cleaning House

Vastu Tips : ఉప్పును కూరలో వేసుకుంటామని తెలుసు.. కానీ వాస్తు ప్రయోజనాల్లోనూ ఉప్పు కీలకపాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఉప్పు నీటితో మీ ఇంటిని తుడిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగి పోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉప్పును ఏ విధంగా ఉపయోగించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Vastu Tips
Vastu Tips For Cleaning House
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 2:23 PM IST

Salt Water Vastu Tips: ఉప్పు వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాకుండా.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి, పాజిటివ్ శక్తిని పెంచుతుందట. కుటుంబ సమస్యలు, గృహ ఇబ్బందులు దూరం చేసి, కుటుంబంలో ఆనందాన్ని నింపడానికి ఉప్పు(Salt) ఎంతగానే ఉపయోగపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి.. ఉప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు చూద్దాం.

ఉప్పు నీటితో ఇంటి క్లీనింగ్ : అందరూ తరచూ ఇంటి ఫ్లోర్​ను నీటితో శుభ్రం చేస్తుంటారు. అయితే.. ఆ నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయట. ఉప్పునీటితో ఇంటిని క్లీన్ చేయడానికి ఉదయం ఉత్తమ సమయమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీటితో ఇంటిని తుడవ వద్దనీ.. సాయంత్రం వేళలోనూ ఉప్పునీటికో క్లీన్ చేయడం అంత మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

ఆ రోజున వద్దు: మీరు గురువారం ఇంటిని తుడుచుకోవడం, శుభ్రపరచడం వంటివి చేయకూడదట. ముఖ్యంగా ఉప్పునీటిని ఉపయోగించి ఇంటిని అస్సలు క్లీన్ చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే.. గురువారం విష్ణువు, బృహస్పతి రోజును సూచిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంటిని తుడుచుకోవడం మానుకోవడం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు.

ఆనందాన్ని నింపుతుంది : ఉప్పునీటిని ఉపయోగించి నేలను తుడుచుకోవడం ద్వారా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ ప్రక్రియ ఇంట్లో శాంతిని నెలకొల్పడంతో పాటు వివిధ సమస్యల నుంచి బయటపడటానికీ చాలా బాగా సహాయపడుతుందట. ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి.. ఉప్పుతో చేసే వాస్తుదోష నివారణ పద్ధతులను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో సమస్యలు తొలగిపోయి ఆనందం నిండుతుందని చెబుతున్నారు.

ఇతర ప్రయోజనాలు: ఉప్పులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇంటిని పూర్తిగా శుభ్రపరచడంలో ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది. ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈగలు, దోమలు ఇతర కీటకాలకు సహజ నిరోధకంగా ఉప్పు పనిచేస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులూ ఇంటిలోకి రాకుండా కాపాడుతుంది.

ఉప్పునీటితో తుడిచే కర్రను ఎలా ఉపయోగించాలంటే..

ఇంటిని ఉప్పుతో తుడవడానికి ముందుగా మీరు ఒక బకెట్‌ తీసుకొని దానిలో వాటర్ నింపుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిలో రెండు-మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో ఇల్లు మొత్తం తుడుచుకోవాలి. అయితే.. ఒక రూమ్ తుడవగానే ఆ నీరు మురికిగా మారితే వాటిని మార్చి.. మళ్లీ ఇదే ప్రక్రియను రిపీట్​ చేస్తూ మీ ఇంటిని మొత్తం నీట్​గా మాపింగ్ కర్రతో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మీరు ఉప్పు నీటితో తుడిచేటప్పుడు బయటి వ్యక్తులు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అలాగే తుడిచిన వాటర్​ను సమీపంలోని కాలువలో పారపోయాలి. ఇలా చేయడం ద్వారా.. ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే అవి దూరమైపోతాయని.. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.

అలర్ట్‌ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.