Monsoon Skin Care Tips : వర్షాకాలంలో తేమ అధికంగా ఉంటుంది. ఇది చర్మం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. ఫలితంగా చర్మంపై రంథ్రాలు, మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు వర్షాకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలున్నాయి.
శరీర దుర్వాసన
రుతుపవనాల సమయంలో చెమట మీ అండర్ ఆర్మ్స్, ఇతర శరీర భాగాల్లోనూ దుర్వాసన వచ్చేలా చేస్తుంది. డియోడెంట్లను వాడితే అలర్జీ, దద్దుర్లుకు దారితీస్తుంది. అందుకే ఈ సీజన్లో చెమట ఎక్కువగా పట్టే వాళ్లు సహజమైన ఉత్పత్తులను వాడాలి. అలాగే కాటన్ దుస్తులు, స్వెట్ ప్యాడ్స్ వాడితే దుర్వాసన నుంచి దూరంగా ఉండచ్చు.
దద్దుర్లు
మిలేరియాగా పిలవబడే చెమట దద్దుర్లు ఎర్రటి రంగులో ఏర్పడయతాయి. ముఖ్యంగా లోఫీవర్తో బాధపడుతున్న వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు చెమట గ్రంథుల్లో ఏదో అడ్డుపడటం వల్ల ఈ దద్దుర్లు ఏర్పడతాయి.
ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు
వర్షాకాలంలో శిలీంధ్రాలు వేడి, తేమతో కూడి ఉంటాయి. అందుకే ఈ సీజన్లో రింగ్ వార్మ్(తామర) వంటి అంటువ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. కాలి వేళ్ల మధ్య, రహస్య భాగాలు వంటి శరీర మడతల్లో ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇవి త్వరగా వ్యాపిస్తాయి.
తామర
అధిక తేమతో పాటు చెమటతో చర్మం పొడిబారుతుంది. ఇది దురద, తామర వంటి దద్దుర్లకు దారితీస్తుంది.
వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం ఎలా?
- అన్ని రకాల స్కిన్ వాళ్లు తప్పకుండా ఎక్సఫోలియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చర్మంరపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించుకోవాలి.
- వర్షాకాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించాలి.
- మీరు వేసుకునే మేకప్ చాలా సున్నితమైనది అయి ఉండాలి.
- రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు.
- జిడ్డు చర్మం ఉన్నావారు తప్పకుండా ఈ సీజన్లో రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
- పొడి చర్మం గలవారు ముఖం శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.
- చర్మం దురద సమస్య ఉన్నవారు వర్షంలో తడిచి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాక సహజమైన ఉత్పత్తులను చర్మానికి రాసుకోవాలి. వీలైనంత వరకూ ఈ సీజన్లో మేకప్‌కు దూరంగా ఉండాలి.
ఆరోగ్యానికి నెయ్యి ఎంత మేలు- మరి చర్మం సంగతేంటి? అందం తగ్గిస్తుందా? - Is Ghee Good For Skin