Mint Health Benefits In Telugu : ఉదయం లేవగానే తాగే టీ నుంచి చట్నీ, మజ్జిగ, సలాడ్స్ ఇలా మనం తీసుకునే ఏదో ఒక ఆహారం లేదా పానీయంలో పుదీనా తప్పక ఉంటుంది. అన్ని వంటకాల్లో ఇంతగా ఉపయోగించే పుదీనాలో మన శరీరానికి మేలు చేసే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పుదీనా తినడం వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాలో తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయని ప్రముఖ డైటీషియన్ శ్రీలత చెబుతున్నారు. ప్రతి 100 గ్రాముల పుదీనాలో 5 గ్రాముల జింక్, 10 గ్రాముల సెలీనియం, 586 మిల్లి గ్రాముల పొటాషియం, 56 మిల్లి గ్రాముల సోడియం సహా విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటుందని చెప్పారు. కాల్షియం, విటమిన్ బీ6, ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయని పేర్కొన్నారు.
'జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి'
పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆహారంలో పుదీనా లేదా మింట్ ఆయిల్నుగానీ చేర్చుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల అవి తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇక శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సైతం పుదీనా తగ్గిస్తుంది. పుదీనాను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అల్సర్లు దరిచేరవు.
చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవారికి కూడా పుదీనా ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు రోజూ పుదీనా జ్యూస్ తాగడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పుదీనాలో మెదడుకు మేలు చేసే ఆరోగ్యకరమైన పోషకాలు మెగ్నీషియం, విటమిన్ బీ 6, మాంగనీస్, ఐరన్ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో పుదీనా ఉండేటట్లు చూసుకోవడం మంచిదని డైటీషియన్ శ్రీలత తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సమ్మర్ స్పెషల్ రాగి జావ - ఇలా చేస్తే వద్దన్నోళ్లు కూడా రెండు గ్లాసులు తాగడం పక్కా!