ETV Bharat / health

మహిళలూ నలభై దాటాక పొట్ట పెరుగుతోందా? - డైలీ ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది! - Menopause Belly Reduce Foods

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 1:06 PM IST

Menopause Belly Reduce Foods : మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తలెత్తడం సహజం. దాంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతుంటారు. అయితే డైలీ ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Best Foods To Reduce Menopause Belly
Menopause Belly Reduce Foods (ETV Bharat)

Best Foods To Reduce Menopause Belly : మెనోపాజ్ దశలో చాలా మంది బరువు పెరగడం సహజం. ముఖ్యంగా ఈ దశలో హార్మోన్ల ప్రభావం కారణంగా వారి శరీరంలో వివిధ మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవే మెనోపాజ్‌ దశలో పొట్ట పెరగడం, నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అయితే, ఇలా పెరిగే పొట్ట ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తుందంటున్నారు. కాబట్టి, నలభై దాటాక/మెనోపాజ్‌ దశలో వచ్చే బెల్లీ ఫ్యాట్​ను​(Belly Fat) తగ్గించుకోవడం చాలా అవసరమంటున్నారు. అందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని.. మీ డైలీ డైట్​లో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరిపోతుందంటున్నారు. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు కరిగి స్లిమ్​గా కనిపిస్తారంటున్నారు. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవిసె గింజలు : ఇవి ఆరోగ్యానికే కాదు.. అధిక బరువు తగ్గించడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే మోనోఅన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇవి శరీరంలో అధిక నీరు చేరకుండా చేయడంతో పాటు ఈస్ట్రోజెన్‌ స్థాయుల్నీ క్రమబద్ధీకరించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు.

సబ్జా గింజలు : వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ప్రేరేపించి వివిధ జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్ : చెడు కొవ్వుల్ని కరిగించడంలో క్యాలరీలు తక్కువగా ఉండే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ పరగడుపున ఒక గ్లాసు వాటర్​లో టేబుల్ స్పూన్ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

2006లో 'జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 6 వారాల పాటు రోజుకు గ్లాసు వాటర్​లో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగిన వ్యక్తులలో బరువు, LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్​(USDA)కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జోషువా బెక్లర్ పాల్గొన్నారు. యాపిల్ సైడర్ చెడు కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

దాల్చిన చెక్క : మన బాడీలో రిలీజ్ అయ్యే కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడికి కారణమవుతుంది. ఇది కూడా బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ హార్మోన్ స్థాయుల్ని తగ్గించడంలో దాల్చిన చెక్క ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఈ జ్యూసుల్లో డైలీ ఏ ఒక్కటి తాగినా సరిపోద్ది! - కొద్ది రోజుల్లోనే 'బెల్లీ ఫ్యాట్' ఐస్​లా కరిగిపోద్ది!!

ఆకుకూరలు : వీటిల్లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యల్ని తగ్గించడంలో దోహదపడుతుందంటున్నారు నిపుణులు. అంటే.. పరోక్షంగా బాడీలో పేరుకున్న చెడు కొవ్వులు, పొట్టనూ తగ్గిస్తుందన్నమాట!

పప్పులు, కాయధాన్యాలు : వీటిల్లో ఫోలికామ్లం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ ‘బి’, ఫైబర్‌, ప్రొటీన్‌.. వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

సీ-ఫుడ్ : మహిళల్లో వివిధ మానసిక సమస్యలకు మెనోపాజ్‌ దశలో తలెత్తే దుష్ప్రభావాలే కారణమవుతుంటాయి. కాబట్టి వీటిని దూరం చేసుకోవాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, సీ-ఫుడ్‌, వాల్‌నట్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు!

ఇవి తీసుకోవడంతో పాటు.. నడక(Walking), పరుగు, బరువులెత్తడం, ఈత, సైక్లింగ్‌.. వంటి వ్యాయామాలు కూడా నలభై దాటాక పొట్టను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు. అయితే ఈ నియమాలు పాటిస్తున్నా ఫలితం లేకపోతే, ఇతర సమస్యలేవైనా ఎదురైతే.. వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బాణపొట్టతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాటర్​ తీసుకుంటే ఇట్టే కరిగిపోద్ది!

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.