Samantha Red Light Therapy Routine : సినిమా తారలకు మాత్రమే కాంతిమంతమైన చర్మం ఎలా ఉంటుందని చాలామంది అనుకుంటారు. వాళ్లు మేకప్ వేసుకుంటారనీ, అందుకే అలా కనిపిస్తారని భావిస్తారు. కానీ, అది నిజం కాదు. మేకప్‌కు, చర్మ సంరక్షణకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే స్కిన్ కాంతిమంతంగా మెరుస్తూ ఉంటుంది. అందుకే చర్మాన్ని సంరక్షించుకునే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇన్స్టాగ్రామ్ పేజీలో నటి సమంత తన చర్మ సౌందర్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ రెడ్ లైట్ థెరపీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'డే ఇన్ మై లైఫ్' అనే వీడియోలో తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలిపారు. స్కిన్ బ్రైట్ నెస్ కోసం రెడ్ లైట్ థెరపీ ఏవిధంగా ఉపయోగపడుతుందో వెల్లడించారు. దీంతో చాలామంది రెడ్ లైట్ థెరపీ అంటే ఏంటీ అని వెతుకుతున్నారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలో రెడ్ లైట్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం.
రెడ్ లైట్ థెరపీ (RLT) అనేది వివిధ రకాల శరీర సమస్యల చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. చర్మం సౌందర్యాకి మెరుగుపరిచేందుకు ఎరుపు కాంతితో కూడిన తక్కువ-స్థాయి తరంగదైర్ఘ్యాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. దీనిని లోలెవల్ లైట్ థెరపీ (LLLT) లేదా ఫోటోబయోమోడ్యులేషన్ అని అంటారు. 2019 బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ "రెడ్ లైట్ థెరపీ ఫర్ ఇంప్రూవింగ్ స్కిన్ టెక్చర్ అనే అంశంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు డెర్మటాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు అబ్దుల్లా, జార్జ్ జెప్పాస్ పరిశోధనలు చేశారు. చర్మం సౌందర్యాన్ని మెరుగు పరచడానికి రెడ్ లైట్ థెరపీ ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలిపారు.
ఈ రెడ్ లైట్ థెరపీ అనేది శరీర సౌందర్యం పెంపొందించే ఓ వైద్య పద్ధతి. ఈ చికిత్స ద్వారా శరీర సౌందర్యాన్ని మెరుగుపరుస్తారు. గాయాలు మానడానికి, అలాగే చర్మం ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి చికిత్సను ఉపయోగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీతో కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతి మొటిమలు, చర్మ క్యాన్సర్ కు చికిత్సలాంటి వాటికి కూడా ఉపయోగ పడుతుంది.
కొల్లాజెన్ ఉత్పత్తి : వయస్సు పెరుగుతున్న కొద్ది కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే, ఈ రెడ్ లైట్ థెరపీ కొల్లాజెన్ మొత్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
రెడ్ లైట్ మొటిమలను తొలగిస్తుంది : ఈ చికిత్స సెబమ్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. కెరాటినోజెనిసిస్ను తగ్గించడంలో సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలు త్వరగా తగ్గడానికి సహకరిస్తుంది. వాపును సైతం తగ్గిస్తుంది.
యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ : రెడ్ లైట్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొల్లాజెన్ ప్రోటీన్ ప్రవాహం పెంచుతుంది. అందువల్ల కారణంగా చర్మం ముడతలు తగ్గతాయి.
ఈ చికిత్స కోసం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు ఈ విధానంలో చికిత్స చేపించుకోవాలనుకుంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు చికిత్స చేసుకోవడం ఉత్తమం.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గ్లోయింగ్ స్కిన్ కావాలా? - నిపుణులు సూచిస్తున్న సూపర్ డైట్ మీ కోసం! - What to Eat for Healthy Skin
నడుము కొవ్వు తగ్గాలా? ఈ యోగాసనాలు చేస్తే ఫలితం ఉంటుందట! - Yoga Asanas for Reducing Hip Fat