These Foods Can Causes Kidney Stones : రోజూ తగినంత వాటర్ తాగకపోతే మూత్రపిండాలలో రాళ్లతోపాటు ఇతర కిడ్నీ సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అలాగని.. నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలలో స్టోన్స్ రావనుకుంటే పొరపాటే అంటున్నారు. డైలీ తగినన్ని నీళ్లు తాగడంతోపాటు ఈ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని, తక్కువ మొత్తంలో తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు.
ఆక్సలేట్లు ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు : కిడ్నీలలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఆక్సలేట్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలను వీలైనంత తక్కువగా తినాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రూట్ వెజిటేబుల్స్ అంటే.. బీట్రూట్, బంగాళదుంపలు, వేరుశనగ వంటి వాటితోపాటు పాలకూర, చాక్లెట్లను ఎక్కువగా తినవద్దని సూచిస్తున్నారు.
2017లో 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం 23% పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని 'యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా'కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జాన్ సి. యాంగ్ పాల్గొన్నారు. ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే పాలకూర వంటివి ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయా? - ఇందులో నిజమెంత? - నిపుణుల సమాధానమిదే!
ఉప్పు : సాధారణంగా అధిక ఉప్పు వినియోగం ఆరోగ్యానికి హానికరం. దాని వల్ల రక్తహీనత, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇవేకాకుండా.. మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వీలైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించడం మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రోజుకు పెద్దలు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదట.
మాంసకృత్తులు : మాంసకృత్తులు ఎక్కువగా ఉండే నాన్‌వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, కిడ్నీ సమస్యలకు కారణమయ్యే జంతు ప్రొటీన్లను తక్కువ మొత్తంలో తీసుకునేలా చూసుకోవాలని చెబుతున్నారు.
C విటమిన్ ఫుడ్స్ : మనం ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ సి చాలా బాగా సహాయపడుతుంది. కానీ, అది పెరిగితే మాత్రం ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాడీలో విటమిన్ సి స్థాయిలు పెరిగితే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, విటమిన్ సి ఫుడ్స్, పండ్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్ : మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్‌తో పాటు వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఈ ఫుడ్స్ కూడా కిడ్నీ స్టోన్స్‌కు దారితీస్తాయంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పాదాలలో వాపు, నొప్పి, దురదగా అనిపిస్తోందా? - అయితే మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!