ETV Bharat / health

అలర్ట్ : కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి! - లైట్‌ తీసుకుంటే అంతే! - Kidney Failure Symptoms

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 9:28 AM IST

Symptoms Of Kidney Disease : ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే.. కిడ్నీలు దెబ్బతింటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మెజార్టీ ప్రజలకు తెలియదు. దీనివల్ల మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే వరకూ పసిగట్టలేకపోతున్నారు. అందుకే.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ కావాలాని సూచిస్తున్నారు నిపుణులు.

Kidney Disease
Symptoms Of Kidney Disease (ETV Bharat)

Kidney Disease Symptoms : మన శరీరంలో గుండె తర్వాత.. అత్యంత కీలకంగా పనిచేసే అవయవాలలో కిడ్నీలు ఒకటి. మూత్రపిండాలు మన బాడీలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. అయితే, నేటి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాలతో అవి పాడైపోతున్నాయి. ఒక్కసారి కిడ్నీలు దెబ్బతింటే.. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, కిడ్నీ వ్యాధులను తొలిదశలో గుర్తిస్తే త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చని అంటున్నారు. అయితే, కిడ్నీ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ నెఫ్రాలజీస్ట్‌ 'డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు' చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల లక్షణాలు తొలిదశలో పెద్దగా కనిపించవు. కానీ, జబ్బు ముదురుతూ వస్తున్నాకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి వైద్యులను సంప్రదిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆకలి లేకపోవడం : రక్తంలో విషతుల్యాలు పెరుగుతున్నా కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. అలాగే వికారంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏ ఆహారం తినాలని అనిపించదు. ఫలితంగా బరువు తగ్గుతారు.

పాదాలలో వాపు, నొప్పి, దురదగా అనిపిస్తోందా? - అయితే మీ కిడ్నీలు డేంజర్​లో ఉన్నట్లే!

పొడి చర్మం , దురద : కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంలో క్యాల్షియం, ఫాస్ఫేట్‌ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

పాదాల వాపు : కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోవు. దీనివల్ల మన బాడీలో ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలాగే పాదాలు, కళ్లు ఉబ్బడం మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.

మూత్రం ఎక్కువగా రావడం : కిడ్నీలు దెబ్బతింటే.. మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. దీనివల్ల నైట్‌ టైమ్‌లో అధికంగా మూత్రం రావడం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అలసట, నీరసం : కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలసట, నీరసం వల్ల రోజంతా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం : బ్లడ్‌లో వ్యర్థాలు పోగవటం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తల తేలిపోవటం లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తీవ్రమైతే మూర్ఛలకూ దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పైన తెలిపిన లక్షణాలలో చాలా వరకు కొన్ని ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తుంటాయి. దీనివల్ల చాలా మంది పొరపడుతుంటారు. దీంతో ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం ఆలస్యమవుతుంది. కాబట్టి, లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైందా? ఈ సింపుల్​ హోమ్​ రెమెడీలతో సమస్యకు చెక్!

అలర్ట్ : డైలీ ఈ ఆహారం తింటున్నారా? - కిడ్నీలో నాలుగు రాళ్లు దాచుకోవడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.