Instead of Milk Calcium Superfoods in Telugu: కాల్షియం ఓ ముఖ్య ఖనిజం. శారీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. దీని కారణంగా ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది రక్తం గడ్డ కట్టడం, కండరాల సంకోచం, గుండె కొట్టుకోవడం, నరాల పనితీరు వంటి అనేక ప్రధాన పనుల్లో సాయపడుతుంది. శరీర అస్థిపంజర నిర్మాణం.. శరీరం కాల్షియం అవసరంలో దాదాపు 99 శాతం నిల్వ చేస్తుంది. మిగిలిన 1 శాతం రక్తం, కండరాలు, కణజాలాలలో కనిపిస్తుంది.
అయితే.. మన శరీరానికి కాల్షియం తినే ఆహారం నుంచే ఎక్కువగా అందుతుంది. ఆరోగ్య నిపుణులు కూడా 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు, స్త్రీలు 1000 మిల్లీగ్రాముల కాల్షియం కలిగి ఉండాలని సిఫార్సు చేస్తారు. అందుకే.. ఎదిగే పిల్లలకు కాల్షియం కచ్చితంగా అవసరం. వృద్ధులకు కూడా కాల్షియం ఎక్కువగా అవరం. అయితే.. పాల ద్వారా కాల్షియం ఎక్కువగా పొందొచ్చు. కానీ.. కొందరు పిల్లలు పాలు తాగరు. ఇలాంటి వారికి.. పాలకు అల్టర్నేట్గా కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
అలర్ట్ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?
బాదం: బాదం పప్పు శరీరానికి అవసరమైన కాల్షియం అందించడంలో సయపడుతుంది. ఓ కప్పు బాదంపప్పులో సుమారుగా 385 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి, ప్రతి రోజూ గుప్పెడు బాదంపప్పు తీసుకుంటే కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం నానబెట్టి తినొచ్చు. లేదంటే ఖాళీ సమయంలో మామూలు బాదం కూడా తినొచ్చు.
సోయా పాలు: పాలకు బదులు ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు సోయా మిల్క్ బెస్ట్ ఆప్షన్. సోయా పాలు, బలవర్ధకమైన కాల్షియంతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. మీకు పాలు, పాల పదార్థాలు అంటే ఇష్టం లేకపోతే మీరు వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
ఉదయాన్నే ఈ అలవాట్లను పాటిస్తే - మీరు 100 ఏళ్లు జీవించడం ఖాయం!
ఆకుకూరలు: ఆకుకూరల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా కాలే, కొల్లార్డ్ గ్రీన్స్, బోక్ చోయ్, పాలకూర వంటి ఆకుకూరల్లో కాల్షియం దండిగా ఉంటుంది. వీటిని మీరు డైలీ ఆహారంలో భాగం చేసుకుంటే సూపర్‌గా కాల్షియం అందుతుంది. అలాగే నారింజ రసం, ఎండిన ఆప్రికాట్లు, టోఫులో కాల్షియం అధికంగా ఉంటుంది.
చేపలు: చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా షెల్ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని డైలీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కాల్షియం కొరత తగ్గుతోంది.
మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది!
నువ్వులు: వంటగదిలో ఏడాది పొడవునా లభించే చాలా సాధారణ పదార్థాల్లో నువ్వులు ఒకటి. వీటిని ఎన్నో రకాలుగా వాడుతుంటాం.. 100 గ్రాముల నువ్వుల్లో సుమారు 600మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని సలాడ్స్, కూరల్లో కూడా వాడడం మంచిది.
ఇకపోతే కాల్షియంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. విటమిన్ డి కారణంగా శరీరంలో కాల్షియం నిల్వ ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా, విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు తినడం వల్ల మీ శరీరానికి తగినంత విటమిన్ డి అందుతుంది.