ETV Bharat / health

ఇది ఒక్క స్పూన్​ తీసుకుంటే - అజీర్తి సమస్య తీవ్రత తగ్గుతుందట!- ఎలా చేయాలో తెలుసా? - Indigestion Treatment as Ayurveda

author img

By ETV Bharat Health Team

Published : Sep 4, 2024, 2:47 PM IST

Updated : Sep 14, 2024, 7:48 AM IST

Indigestion Treatment: అజీర్తి సమస్య మనలో చాలా మందిని వేధిస్తుంటుంది. దీంతో కొందరు బయట లభించే మందులను వినియోగిస్తుంటారు. అయితే, ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Indigestion Treatment in Ayurveda
Indigestion Treatment in Ayurveda (ETV Bharat)

Ayurvedic Home Remedy to Reduce Indigestion: కడుపులో ఏ చిన్న సమస్య వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అజీర్తి సమస్య అయితే చెప్పలేనంత బాధ పెడుతుంది. తిన్నది అరగకపోవడం.. కడుపంతా ఉబ్బరంగా ఉండడం వల్ల పొట్టంతా రాయిలా మారుతుంది. ఫలితంగా ఎటు కదలలేక.. ఏ పనీ చేయలేకపోతుంటాం. అయితే, ఈ సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద ఫిజిషియన్‌ గాయత్రీ దేవీ. పథ్యాహారం తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఔషధానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలు

  • 250 గ్రాముల అల్లం పేస్ట్​
  • 275 గ్రాముల పటిక బెల్లం పొడి
  • 5 గ్రాముల శొంఠి పొడి
  • 10 గ్రాముల పిప్పళ్ల పొడి
  • 10 గ్రాముల మిరియాల పొడి
  • 5 గ్రాముల యాలకుల పొడి
  • తేనె

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో అల్లం పేస్ట్​ను వేసి కాసేపు వేగనివ్వాలి
  • ఆ తర్వాత పటిక బెల్లం పొడిని వేసి లో ఫ్లేమ్​లో కలపాలి.
  • అనంతరం ఇందులోనే శొంఠి పొడి, మిరియాలు, యాలకులు, పిప్పళ్ల పొడిని కలపాలి.
  • ఈ పొడులన్నీ బాగా కలిశాక స్టౌ ఆఫ్​ చేసి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని తేనె కలుపుకోవాలి.
  • అజీర్తి సమస్య ఉన్నవాళ్లతో పాటు రాకుండా ఉండేవారు కూడా ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  • ఆహారం తీసుకునే 10 నిమిషాల ముందు ఓ చెంచాడు పరిమాణంలో ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

శొంఠి: సాధారణంగానే మనకు అజీర్తిగా ఉన్నప్పుడు శొంఠి తినాలని మన పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే శొంఠి జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పిప్పళ్లు: పిప్పళ్లలో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అజీర్తి సమస్య తగ్గిపోతుందని వివరిస్తున్నారు

మిరియాలు: మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతుంటారు. ఇన్​ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి వీటిని వాడతారు. ఇందులో అజీర్తి సమస్యను తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.

యాలకులు: సుగంధ ద్రవ్యమైన యాలకులు అజీర్తి సమస్యను పరిష్కరించడంలో మంచిగా సహాయ పడుతుందని ఆయుర్వేద నిపుణుు చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్ర ఒక్కటే కాదు కళ్ల కింద డార్క్ సర్కిల్స్​కు ఇవీ కారణాలే!​ - ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే క్యూర్​! - Dark Circles Causes and Treatment

అలర్ట్​ - బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్​ షేక్స్​ తీసుకుంటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Protein Shakes in Breakfast is Good

Last Updated : Sep 14, 2024, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.