ETV Bharat / health

అలర్ట్ : అతి చలిగా అనిపిస్తోందా? ​- ఈ సమస్యే కావొచ్చట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 3:47 PM IST

Hypothyroidism Symptoms: చలికాలంలో కాకుండా మిగతా సమయాల్లో కూడా మీరు విపరీతమైన చలితో బాధపడుతున్నారా..? అయితే అలర్ట్​ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Hypothyroidism Symptoms
Hypothyroidism Symptoms

Hypothyroidism Symptoms: చలికాలంలో చలిగా అనిపించడం, చలికి వణకడం సహజం. కానీ.. మిగతా సీజన్లలో కూడా మీరు చలితో వణికిపోతుంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు నిపుణులు. ఇది హైపోథైరాయిడిజం లక్షణం కావొచ్చని అంటున్నారు. మరి.. ఈ హైపోథైరాయిడిజం అంటే ఏమిటి..? లక్షణాలేంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

హైపోథైరాయిడిజం(Hypothyroidism): థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రధాన హార్మోన్ల ఉత్పత్తి కేంద్రం. థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని అన్ని కణాల పనితీరునూ నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోవడాన్నే.. హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంథి సాధారణంగా జీవక్రియలు, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మీ శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాలేకపోతే.. మీరు ఇతరుల కన్నా ఎక్కువ చలిని అనుభూతి చెందే అవకాశం ఉంది.

చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

ఎవరిలో ఎక్కువ: హైపోథైరాయిడిజం.. మహిళలు, పురుషులలో ఇద్దరిలో ఉంటుంది. అయితే, పురుషుల కంటే మహిళలకే ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం.. 50 ఏళ్ల వయసున్న మహిళలు 10 శాతం, 60 ఏళ్లు పైబడిన మహిళలు 15 శాతం మంది హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. ఇక పురుషులలో, 50 ఏళ్లకు పైనే ఉన్న పురుషులలో 5 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులలో 10 శాతానికి పైగా హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు.

లక్షణాలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హైపోథైరాయిడిజాన్ని కేవలం చలికి తట్టుకోలేక పోవడం అనే లక్షణంతోనే నిర్ధారించలేరు. ఇంకా ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే..

  • అలసట
  • చేతుల్లో తిమ్మిర్లు
  • మలబద్ధకం
  • బరువు పెరగడం
  • శరీరం అంతటా నొప్పి, కండరాల బలహీనత
  • అధిక కొలెస్ట్రాల్​
  • చర్మం, జుట్టు పొడిబారడం
  • లైంగిక ఆసక్తి తగ్గిపోవడం
  • కళ్లు, ముఖం వాపు
  • బ్రెయిన్​ ఫాగ్​.. ఇతర లక్షణాలు ఉన్నాయి

పురుషుల్లో మొటిమల సమస్య - ఇలా చెక్ పెట్టండి!

హైపోథైరాయిడిజానికి కారణామేమిటి: ఈ పరిస్థితికి పలు రకాల కారణాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అందులో కొన్ని చూస్తే..

  • తక్కువ స్థాయిలో థైరాయిడ్​ హర్మోన్లను రిలీజ్​ కావడం
  • పిట్యూటురీ గ్రంథి థైరాయిడ్​ హార్మోన్లను సమతుల్యం చేయడానికి థైరాయిడ్​ స్టిమ్యులేటింగ్​ హార్మోన్​ (TSH)ని పంపలేకపోవడం
  • థైరాయిడ్ గ్రంథి వాపు (థైరాయిడిటిస్)
  • థైరాయిడ్ గ్రంథిపై కణతులు
  • థైరాయిడ్ గ్రంథి శస్త్రచికిత్స
  • థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసే రేడియేషన్ చికిత్స
  • అటాక్సిక్ గ్రోవ్స్ డిసీజ్ (AIG)
  • ఆటోఇమ్యూన్ థైరాయిడిటిస్
  • థైరాయిడ్ గ్రంథి జన్యుపరమైన రుగ్మతలు

హైపోథైరాయిడిజానికి చికిత్స చేయకపోతే ఏం జరుగుతుంది: ఒకవేళ సరైన సమయంలో హైపోథైరాయిడిజానికి చికిత్స చేయకపోతే అది తీవ్రమైన, ప్రాణాంతకమైన సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ లక్షణాలు కూడా తీవ్రంగా మారవచ్చని అంటున్నారు. అవి..

హైపోథైరాయిడిజం ఉన్నవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తీవ్రతరం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అందులో మొదటిది.. థైరాయిడ్ హార్మోన్ల మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం. ఇక ఆరోగ్యకరమైన ఆహారం అంటే తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు, ఎక్కువ పీచు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీర బరువును నియంత్రించడంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి.

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!

కోపంతో గోడలను గుద్దుతూ, బ్లేడుతో చేతులు కట్ చేసుకుంటున్నారా?

కచ్చితంగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా? దానిని తింటే ఫలితం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.