Hula Hoop Health Benefits : మనం హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారం తీసుకుంటూనే.. వ్యాయామం కూడా చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే.. మనలో చాలా మంది పౌష్టికాహారం తీసుకుంటారు కానీ, ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి ఆసక్తి చూపించరు. జిమ్‌లోకి వెళ్లి కసరత్తులు చేయాలని చెప్పినా, ఉదయాన్నే లేచి గ్రౌండ్లో జాగింగ్ చేయాలని సూచించినా.. "అమ్మో నా వల్ల కాదు" అంటుంటారు. అయితే.. ఇలాంటి వారు ఆడుతూ పాడుతూ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవడానిక ఒక ఈజీగా ఎక్సర్‌సైజ్ ఉందంటున్నారు నిపుణులు. అదే 'హూలాహూప్ వ్యాయామం'. రోజూ ఈ హూలాహూప్ ఎక్సర్‌సైజ్‌ను కొద్ది సేపు చేశారంటే.. ఈజీగా ఫ్యాట్ కరిగించుకోవచ్చని నిపుణులంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది :
క్రమం తప్పకుండా హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులంటున్నారు. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
క్యాలరీలు కరుగుతాయి :
రోజూ హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండవచ్చు. మాయో క్లినిక్ నివేదిక ప్రకారం సాధారణంగా 30 నిమిషాల పాటు హూలాహూప్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మహిళల్లో దాదాపు 165 క్యాలరీలు ఖర్చు అవుతాయట. అలాగే పురుషులలో 200 క్యాలరీలు బర్న్ అవుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఒత్తిడి తగ్గుతుంది :
ఈ హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మనం సంతోషంగా, ఆనందంగా ఉండటంలో ఎంతో సహాయపడతాయని నిపుణులంటున్నారు.
బరువు తగ్గుతారు :
బరువు తగ్గాలని అనుకుని బద్ధకంగా జిమ్‌కు వెళ్లకుండా, వ్యాయాలు చేయకుండా ఉండే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. రోజూ హూలాహూప్స్ వ్యాయామం చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించుకోవచ్చని నిపుణులంటున్నారు.
ఎలా చేయాలి? : మార్కెట్లో హూలాహూప్ వ్యాయామానికి ప్లాస్టిక్ రింగ్ లభిస్తుంది. దాన్ని నడుముకు తగిలించుకొని గుండ్రంగా తిప్పాలి. అంటే.. నడుము తిప్పడం ద్వారా.. ఆ రింగ్ కింద పడకుండా రొటేట్ చేస్తూ ఉండాలి. మొదట్లో ఇది సాధ్యం కాదు. కానీ.. అలాగే ప్రయత్నిస్తూ వెళ్లాలి. కొన్ని రోజుల్లోనే అలవాటైపోతుంది.
వీరు ఈ వ్యాయామానికి దూరంగా ఉండాలి..
- ప్రెగ్నెన్సీ సమయంలో హూలాహూప్ వ్యాయామానికి మహిళలు దూరంగా ఉండాలని నిపుణులంటున్నారు. అలాగే ఇంకేదైనా వ్యాయామాలను చేయాలనుకుంటే వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోవాలి.
- అలాగే.. వెన్ను నొప్పి, ఇంకా ఇతర వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ హూలాహూప్ వ్యాయామం చేయవద్దు. దీనివ్లల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
- ఎముకలు బలంగా లేని వారు ఈ వ్యాయామాన్ని చేయకపోవడమే మంచిది.
- అలాగే ఇటీవల ఏదైనా సర్జరీలు జరిగి, లేదా తీవ్ర గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారు కూడా ఈ వ్యాయామం చేయకూడదు.
- ఒక్కసారిగా ఈ వ్యాయామాన్ని చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, రోజూ ప్రాక్టిస్ చేస్తే సాధ్యం అవుతుంది.
ఈజీగా బరువు తగ్గాలా? ఉదయం పూట ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్!
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? - ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే వెన్నలా కరిగిపోద్ది!
ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ఫేస్ మిలమిలా మెరవడం గ్యారంటీ!